IRCTC | భారతదేశంలో చాలా మంది రైలు ప్రయాణాలే చేస్తుంటారు. ఎందుకంటే ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుందని. ఇక సుదూర ప్రయాణాలు చేసే వారైతే.. రాత్రి పూటనే ప్రయాణించేందుకు ఇష్టపడుతుంటారు. మరి రాత్రి సమయాల్లో రైల్లో ప్రయాణించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా గట్టిగా మాట్లాడినా, అరిచినా జరిమానా విధించనున్నారు. ఈ మేరకు ఇండి‌యన్‌ రైల్వే క్యాట‌రింగ్‌ అండ్‌ టూరిజం కార్పొ‌రే‌షన్‌(ఐ‌ఆ‌ర్‌‌సీ‌టీసీ) నూతన మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ‌చే‌సింది. ముఖ్యంగా రాత్రి పూట ప్రయా‌ణించే వారి కోసం […]

IRCTC | భారతదేశంలో చాలా మంది రైలు ప్రయాణాలే చేస్తుంటారు. ఎందుకంటే ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుందని. ఇక సుదూర ప్రయాణాలు చేసే వారైతే.. రాత్రి పూటనే ప్రయాణించేందుకు ఇష్టపడుతుంటారు. మరి రాత్రి సమయాల్లో రైల్లో ప్రయాణించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా గట్టిగా మాట్లాడినా, అరిచినా జరిమానా విధించనున్నారు. ఈ మేరకు ఇండి‌యన్‌ రైల్వే క్యాట‌రింగ్‌ అండ్‌ టూరిజం కార్పొ‌రే‌షన్‌(ఐ‌ఆ‌ర్‌‌సీ‌టీసీ) నూతన మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ‌చే‌సింది. ముఖ్యంగా రాత్రి పూట ప్రయా‌ణించే వారి కోసం వీటిని విడు‌దల చేసింది.వీటిని పాటిం‌చని ప్రయా‌ణి‌కు‌లకు జరి‌మానా విధిం‌చ‌ను‌న్నారు.

నిబంధనలు ఇవే..

  1. రాత్రి సమయాల్లో రైల్లో ప్రయాణించే వారు బోగీల్లో గట్టిగా మాట్లాడకూడదు, అరవొద్దు. స్పీకర్ పెట్టి పాటలు వినకూడదు.
  2. ప్రయాణికులే కాదు.. రైల్వే ఎస్కార్ట్, మెయింటెనెన్స్ స్టాఫ్ కూడా గట్టిగా అరవొద్దు.
  3. రాత్రి 10 గంటలు దాటిన తర్వాత.. టీటీఈ టికెట్ తనిఖీలు చేయొద్దు.
  4. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు మిడిల్ బెర్త్ ప్రయాణికులు హాయిగా నిద్రించొచ్చు.
  5. సీటు కేటా‌యిం‌చిన ప్రయా‌ణి‌కులు రాక‌పోతే, గంట తర్వాత లేదా రెండు స్టేషన్లు దాటా‌కనే (ఏది ముందు అయితే అది) వేరే‌వా‌రికి టీటీఈ సీటు కేటా‌యిం‌చాలి.
  6. కుటుం‌బంలో ఒక‌రికి సీటు కన్ఫార్మ్‌ అయ్యి, ఇంకొ‌క‌రికి కాక‌పో‌యినా.. కన్ఫార్మ్‌ అయిన వ్యక్తి ప్రయా‌ణించ‌క‌పోతే ఆ సీటులో టికెట్‌ కన్ఫార్మ్‌ కాని వ్యక్తి ప్రయా‌ణించొచ్చు.
Updated On 1 Nov 2022 6:26 AM GMT
subbareddy

subbareddy

Next Story