విధాత: పంచాయితీ జూనియర్ (JPS) ఔట్సోర్సింగ్ కార్యదర్శులు శనివారం కూడా తన సమ్మెను యధాతధంగా కొనసాగించారు. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలో మానవహారం నిర్వహించి మహనీయుల విగ్రహాలకు వినతిపత్రం సమర్పించారు. అలాగే ఆత్మహత్య చేసుకున్న రంగాపురం పంచాయతీ కార్యదర్శి సోనీకి నివాళులర్పించారు.
నల్గొండలో ఎన్జీ కాలేజ్ నుండి బాబు జగజీవన్ విగ్రహం వరకు మానవ హారం నిర్వహించారు. సమ్మెలో భాగంగా నాలుగు సంవత్సరాల ప్రొఫెషన్ కాలాన్ని సర్వీస్ కాలంగా పరిగణిస్తూ రెగ్యులర్ చేయాలని, చనిపోయిన పంచాయతి కార్యదర్శికి న్యాయం చేయాలని జేపిఎస్, ఒపిఎస్ లు కోరారు. ఓపియస్ లను జేపీఎస్ గా కన్వర్ట్ చేయాలని డిమాండ్ చేశారు.