HomelatestJr NTR | బుడ్డోడికి పిలుపొచ్చింది.. నంద‌మూరి కుటుంబం నుంచి జూనియర్‌కు ఆహ్వానం

Jr NTR | బుడ్డోడికి పిలుపొచ్చింది.. నంద‌మూరి కుటుంబం నుంచి జూనియర్‌కు ఆహ్వానం

విధాత‌: మొత్తానికి ఎన్టీయార్ ఫ్యామిలీకి ఇన్నాళ్లకు జూనియర్ ఎన్టీయార్ (Jr NTR) యాదికొచ్చాడు. పెద్ద ఎన్టీయార్ శత జయంతి ఉత్సవాలు రెండు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు..మొన్న విజయవాడలో జరిగిన సభకు రజనీకాంత్ ను పిలిచారు. బాలయ్య బాబు చంద్రబాబు తదితరులు హాజరైన ఈ సభకు కనీసం హరికృష్ణ కొడుకుగా జూనియర్ ను పిలవాల్సిన అర్హత ఉన్నా ఎక్కడా ఆయన్ను గుర్తించలేదు.

అయితే.. ఆయన్ను పిలిస్తే బాగున్నని, పిలిస్తే వెల్లేవాడని ఆయన అభిమానులు భావిస్తూ వచ్చారు. ఆఖరుకు తెలంగాణలో మంత్రి పువ్వాడ అజయ్ ఖమ్మంలో ఎన్టీయార్ 56 అడుగుల ఎత్తులో ఎన్టీయార్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆవిష్కరణకు ఈనెల 28న జూనియర్ను ఆహ్వానించగా దానికి వెళ్లేందుకు జూనియర్ అంగీకరించారు.

దీంతో టిడిపి నాయకుల్లో ఆలోచన వచ్చినట్లు ఉంది. ఈ నెల 20న హైదరాబాద్‌లో జరిగే ఎన్టీయార్ శత జయంతి ఉత్సవాలకు హాజరు కావాలని కమిటీ చైర్మన్ హోదాలో టీడీ జనార్ధన్, ఎన్టీయార్ చిన్న కుమారుడు నందమూరి రామక్రిష్ణ ఆహ్వానం అందించారు. ఈ సభకు చంద్రబాబు, బాలయ్య కూడా హాజరవుతారు. ముఖ్యంగా చంద్రబాబుతో కలసి వేదిక పంచుకోవడానికి జూనియర్ ఓకేనా అనే సందేహాలు ఉన్నాయి.

ఒకవేళ గతంలో మాదిరిగా ఈ సభలో కూడా హరికృష్ణ, జూనియర్ అభిమానులు జై హరికృష్ణ.. జూనియర్ నినాదాలు గానీ చేస్తే అటు చంద్రబాబుకు, ఇటు బాలయ్యకు సైతం ఇబ్బందికరంగానే ఉంటుంది. గతంలో కృష్ణా జిల్లాలో చంద్రబాబు పాల్గొన్న బహిరంగ సభలో ఇలాగే జై జూనియర్ అంటూ ఫ్యాన్స్ నినాదాలు చేసి చంద్రబాబుకు ఇరిటేషన్ తెప్పించారు. ఒకవేళ అలాంటి పరిస్థితులు హైదరాబాద్ సభలోనూ వస్తాయేమో అని టిడిపి వర్గాలు.. ముఖ్యంగా చంద్రబాబు అనుయాయులు సందేహ పడుతున్నారు. ఏదైతేనేం మొత్తానికి బుడ్డోడికి తాతయ్య సభకు పిలుపొచ్చింది.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular