Jr NTR విధాత‌: నందమూరి ఫ్యామిలీలో లెజెండ్ నందమూరి తారక రామారావు తర్వాత ఆయన వారసులుగా చాలా మంది వచ్చారు. కానీ ఆయన లెగసీని నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే కంటిన్యూ చేస్తున్నారు. వీరిలో తాత పోలికలతో ఉన్న జూనియర్ ఎన్టీఆర్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎటువంటి పాత్రనైనా అవలీలగా, అలవోకగా ఆకళింపు చేసుకోగల హీరో‌గా ఎన్టీఆర్ ప్రసిద్ధిగాంచారు. అంతలా ఎన్టీఆర్ ఆ పాత్రల్లో ఒదిగిపోతారు. బాల నటుడిగా ఇండస్ట్రీలో […]

Jr NTR

విధాత‌: నందమూరి ఫ్యామిలీలో లెజెండ్ నందమూరి తారక రామారావు తర్వాత ఆయన వారసులుగా చాలా మంది వచ్చారు. కానీ ఆయన లెగసీని నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే కంటిన్యూ చేస్తున్నారు. వీరిలో తాత పోలికలతో ఉన్న జూనియర్ ఎన్టీఆర్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎటువంటి పాత్రనైనా అవలీలగా, అలవోకగా ఆకళింపు చేసుకోగల హీరో‌గా ఎన్టీఆర్ ప్రసిద్ధిగాంచారు.

అంతలా ఎన్టీఆర్ ఆ పాత్రల్లో ఒదిగిపోతారు. బాల నటుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి ‘ఆది, యమదొంగ, నాన్నకు ప్రేమతో, జనతా గారేజ్, అరవింద సమేత, ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా మించి సినిమా, హిట్ మించి హిట్ అనేలా టాలీవుడ్‌లో తన స్థానాన్ని పదిలపరుచుకుంటున్నాడు. ఎంత క్రేజ్ ఉన్నప్పటికీ కించిత్తైన గర్వంలేని వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. ఇటు సినిమాలే కాదు.. నిజ జీవితంలో కూడా చాలా సింపుల్‌గా ఉండాడట ఈ యంగ్ టైగర్.

అతని సింప్లిసిటీకి సంబంధించి ఇప్పుడొక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ గ్లోబల్ స్టార్ వాళ్ల అమ్మకి తను చదువుకునే రోజుల్లోనే ఒక ప్రామిస్ చేశాడట. అదేమిటంటే.. నందమూరి ఫ్యామిలీ అంటే ఆడవాళ్లను చాలా గౌరవించే ఫ్యామిలీ అని.. ఎప్పుడూ కూడా ఆడవారి పట్ల దురుసుగా ప్రవర్తించవద్దని.. వాళ్ళని ఎంతో అభిమానంగా చూసుకోవాలని..

ప్రేమ గీమా లాంటివి పెట్టుకుని నందమూరి ఇంటి పరువు తీయవద్దని.. ఆ ఇంటికి మచ్చ తీసుకు రాకూడదని ఎన్టీఆర్ మదర్ షాలిని చిన్నప్పుడే తారక్ దగ్గర మాట తీసుకున్నారట. అందుకు ఎన్టీఆర్ కూడా నేనెప్పటికీ అటువంటి తప్పుడు పనులు చేయనని తల్లికి మాటిచ్చాడట.

తల్లికి ఇచ్చిన మాట ప్రకారం.. ఆ ఫ్యామిలీ తనని దూరం పెట్టినా.. కూడా ఓపికగా సహించాడే తప్ప, ఆ ఫ్యామిలీకి ఎటువంటి చెడ్డ పేరు తీసుకురాలేదు. అంతే కాదండోయ్ ఆ ఫ్యామిలీకి ఉన్న పేరుని మరింతగా పెంచుతున్నాడు కూడా. నిజంగా ఇంకొకరైతే.. తనకున్న ఇమేజ్‌కి ఎప్పుడో ఆ ఫ్యామిలీని దూరం పెట్టి.. తన సొంత ఇమేజ్‌ని నిలబెట్టుకునేవారు. ఎందుకంటే.. నందమూరి ఫ్యామిలీ.. తారక్‌ని అలా తొక్కిపెట్టింది. అయినా సరే.. కెరటంలా టైగర్ తన కీర్తి కిరీటాన్ని ఎగరవేస్తూనే ఉన్నారు. దటీజ్ తారక్.

Updated On 15 Sep 2023 8:58 AM GMT
somu

somu

Next Story