NTR | ఇటీవల నందమూరి ఫ్యామిలీలో జరిగిన వేడుక ప్రతి ఒక్కరిని ఎంతగా ఆకర్షించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నందమూరి హరికృష్ణ తనయ సుహాసిని కొడుకు పెళ్లి కావడంతో కళ్యాణ్ రామ్, జూ. ఎన్టీఆర్ ఇద్దరూ కూడా తమ సోదరి కొడుకు పెళ్లి విషయంలో అన్ని ఏర్పాట్లు చూసుకున్నారు. ఈ పెళ్లి ఆదివారం రోజు గచ్చిబౌలిలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు. అయితే ఈ పెళ్లి వేడుకలో నందమూరి […]

NTR |
ఇటీవల నందమూరి ఫ్యామిలీలో జరిగిన వేడుక ప్రతి ఒక్కరిని ఎంతగా ఆకర్షించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నందమూరి హరికృష్ణ తనయ సుహాసిని కొడుకు పెళ్లి కావడంతో కళ్యాణ్ రామ్, జూ. ఎన్టీఆర్ ఇద్దరూ కూడా తమ సోదరి కొడుకు పెళ్లి విషయంలో అన్ని ఏర్పాట్లు చూసుకున్నారు.
ఈ పెళ్లి ఆదివారం రోజు గచ్చిబౌలిలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు. అయితే ఈ పెళ్లి వేడుకలో నందమూరి బ్రదర్స్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, బాలయ్య కొడుకు నందమూరి మోక్షజ్ఞ ఒకే ఫ్రేములో కనిపించి అభిమానులకి కనువిందు చేశారు.
దీనితో బాలయ్య అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. వీరి సంబరాలు రెట్టింపు అయ్యే విధంగా మరో పిక్ వైరల్ గా మారింది. తమ్ముడు మోక్షజ్ఞకి ఎన్టీఆర్ ఆప్యాయంగా హగ్ ఇస్తున్న పిక్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
ఈ చిత్రంలో అన్న హగ్ ఇస్తుండడంతో మోక్షజ్ఞ చాలా సంతోషంగా చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నాడు. ఎన్టీఆర్‌కి బాలయ్యకి మధ్య విభేదాలు ఉన్నాయని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంతో వీరిద్దరి హగ్ మాత్రం పుకార్లన్నింటికి పులిస్టాప్ పెట్టిందని చెప్పాలి. ఎన్టీఆర్‌కి బాలయ్య ఫ్యామిలీకి మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఈ పిక్ క్లారిటీ ఇస్తుంది.
ఇక మోక్షజ్ఞ విషయానికి వస్తే ఆయన టాలీవుడ్ ఎంట్రీ గురించి చాలా కాలంగా రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. మోక్షజ్ఞ ఇటీవల స్లిమ్ అయి పబ్లిక్ అప్పియరెన్స్ ఇచ్చిన నేపథ్యంలో వెండితెర ఎంట్రీకి సిద్దమే అన్నట్లుగా సంకేతాలు అందుతున్నాయి.
బాలయ్య డైరెక్షన్‌లో సినిమా ఉంటుందా లేకపోతే ఇతర దర్శకుల సినిమాలో నటిస్తారా అనే దానిపై క్లారిటీ రావలసి ఉంది. ఏది ఏమైన జూనియర్ ఎన్టీఆర్, మోక్షజ్ఞ బాండింగ్‌కి సంబంధించి మాత్రం ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా హాట్ టాపిక్‌గా మారింది. ఇక జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే ఆయన దేవర అనే చిత్రంలో నటిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది.
