ఉన్న‌మాట‌: జూనియర్ ఎన్టీయార్ పాపం తనకు సంబంధం లేకపోయినా రాజకీయాల్లోకి బలవంతంగా లాగబడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఎంత దూరంగా ఉందామనుకున్నా పరిస్థితులు ఉండనివ్వడం లేదు.. ఏదోలా జోక్యం తప్పనిసరి అవుతోంది. పోనీ ఏదోలా రెండు ముక్కలు పెదవి విప్పి మాట్లాడి ఊరుకుందాం అంటే అటు టీడీపీ క్యాడర్ ఊరుకోవడం లేదు. తాను పూర్తిగా రాజకీయ నాయకుడి అవతారం ఎత్తి చంద్రబాబును మోస్తూ జగన్ మీద మాటల దాడి చేయాలని కోరుకుంటున్నారు. దానికి తోడు కామెంట్లు..సెటైర్లు.. ఎత్తి పొడుపులు.. […]

ఉన్న‌మాట‌: జూనియర్ ఎన్టీయార్ పాపం తనకు సంబంధం లేకపోయినా రాజకీయాల్లోకి బలవంతంగా లాగబడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఎంత దూరంగా ఉందామనుకున్నా పరిస్థితులు ఉండనివ్వడం లేదు.. ఏదోలా జోక్యం తప్పనిసరి అవుతోంది.

పోనీ ఏదోలా రెండు ముక్కలు పెదవి విప్పి మాట్లాడి ఊరుకుందాం అంటే అటు టీడీపీ క్యాడర్ ఊరుకోవడం లేదు. తాను పూర్తిగా రాజకీయ నాయకుడి అవతారం ఎత్తి చంద్రబాబును మోస్తూ జగన్ మీద మాటల దాడి చేయాలని కోరుకుంటున్నారు.

దానికి తోడు కామెంట్లు..సెటైర్లు.. ఎత్తి పొడుపులు.. ఏందో పాపం జూనియర్ హెల్త్ వర్సిటీకి ఉన్న ఎన్టీఆర్ పేరును తీసేసి వైఎస్సార్ పేరుతో శాసన సభలో బిల్లు తేవడం.. ఇది టీడీపీ వర్గాల్లో ఆగ్రహానికి కారణం అవ్వడం దానికి జూనియర్ సైతం స్పందించాల్సి రావడం.. ఇవన్నీ అందరికి తెలిసిందే. టీడీపీ శ్రేణులు ఓ వైపు భారీగా ధర్నాలకు తెగబడుతూనే జూనియర్ మద్దతు కోసం చూస్తోంది.

దీంతో ఆయన కూడా ఎన్టీఆర్ని పొగుడుతూ ట్వీట్ చేశారు. పేరు మార్చినా తాత గౌరవం తగ్గదు.. ఎవరూ తగ్గించలేరు అని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సరిగ్గా ఇదే ట్వీట్లో అటు వైఎస్ ఔన్నత్యాన్ని కూడా కొనియాడారు. వైఎస్సార్ కూడా గొప్ప నాయకుడే అంటూ అటు ఎన్టీయార్.. వైఎస్సార్ ఇద్దర్నీ సమానంగా ట్రీట్ చేశారు. సరిగ్గా ఇదే టీడీపీ వర్గాల్లో ఆగ్రహానికి కారణం అయింది.

జూనియర్ లాంటి టాప్ హీరో రియాక్షన్ ఇలా ఉంటుందా. అసలు బాలేదు అంటూ ట్రోలింగ్ జరుగుతోంది. జూనియర్ చాలా పేలవంగా బలహీనంగా రియాక్ట్ అయ్యారంటూ ఒక వైపు టీడీపీ వారు మరో వైపు ఎన్టీయార్ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియా వేదికగా బాణాలు వేస్తున్నారు. గతంలో కూడా మేనత్త భువనేశ్వరి మీద అసెంబ్లీ వేదికగా వైసీపీ వారు కామెంట్స్ చేశారని పెద్ద దుమారమే టీడీపీ నుంచి రేగింది.

అపుడు కాస్తా ఆలస్యంగా వీడియో రిలీజ్ చేసిన జూనియర్ మెత్తమెత్తగా తన స్పందనను తెలియజే శారని ఏకంగా టీడీపీ నాయకులే ఆయన మీద ఫైర్ అయ్యారు. అలా ఆ వివాదం కొన్నాళ్ళ పాటు సాగింది. ఇపుడు చూస్తే హెల్త్ వర్శిటీ వివాదం వచ్చిపడింది. జూనియర్ ట్వీట్ లో వైఎస్సార్ పేరు రావడం ఆయన గొప్ప నాయకుడు అంటూ ఆయన చెప్పడం కూడా టీడీపీ వారికి రుచించలేదు. జూనియర్ సేఫ్ గేమ్ ఆడారని ఆడిపోసుకుంటున్నారు.

ఇలాంటి సందర్భాల్లోనే జూనియర్ శివాలెత్తిపోవాలని, వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖండఖండాలుగా నరికి పోగులు పెట్టాలి కానీ ఇలా తమలపాకుతో కొట్టినట్లు కొడితే ఏమి లాభమని అంటున్నారు. ఇక టిడిపి సోషల్ మీడియాలోనూ..టిడిపి సపోర్ట్ ఉన్న టివి ఛానెళ్లలోనూ జూనియర్ కు పౌరుషం లేదని.. పిరికివాడని.. గోడమీద పిల్లి అని కామెంట్లు పెడుతూ ఆయన్ను టార్గెట్ చేస్తున్నారు.

Updated On 23 Sep 2022 9:38 AM GMT
Somu

Somu

Next Story