HomelatestNTR 100 Years Celebrations | జూనియర్ రావడం లేదు.. ఫక్తు టీడీపీ సభగా NTR...

NTR 100 Years Celebrations | జూనియర్ రావడం లేదు.. ఫక్తు టీడీపీ సభగా NTR జయంత్యుత్సవం

విధాత‌: నేటి సాయంత్రం కూకట్ పల్లిలో భారీగా నిర్వహించనున్న ఎన్టీయార్ శ‌త జయంత్యుత్సవాలకు (NTR 100 Years Celebrations)  జూనియర్ ఎన్టీయార్ వస్తాడని టీడీపీ నాయకులూ భావించినా అయన రావడం లేదని తెలుస్తోంది. సరిగ్గా ఈరోజే తన పుట్టినరోజు కావడంతో ముందుగా నిర్ణయించిన కొన్ని కార్యక్రమాలు ఉన్నాయని, అందుకే తాతయ్య సభకు రావడం లేదని జానియర్ నుంచి వచ్చినట్లుగా ఓ వాట్సాప్ మెసేజ్ సర్క్యులేట్ అవుతోంది.

వాస్తవానికి ఇది ఎన్టీయార్ జయంత్యుత్సవం అని చెబుతున్నా అందులో మొత్తం టీడీపీ పెత్తనమే ఉంది. ఈ ఉత్సవ కమిటీ చైర్మన్ టీడీ జనార్ధన్ తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యునిగా , చంద్రబాబు రాజకీయ కార్యదర్శిగా కూడా ఉన్నారు. దీంతో ఇది సంపూర్ణంగా టీడీపీ సభగానే మారుతుందని అంటున్నారు. ఈ సభ ఆంధ్రాలో నిర్వహించి రజనీకాంత్ వంటి వారిని పిలిచారు కానీ జూనియర్ను పిలవలేదు.

కానీ ఆ తరువాత ఖమ్మంలో భారీ ఎన్టీయార్ విగ్రహావిష్కరణకు తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ స్వయానా వెళ్లి జూనియర్‌ను పిలుపు చేయడం, దానికి ఆయన సమ్మతించడం జరిగిపోయాయి. ఆ తరువాతా ఆ విగ్రహం రూపు రేఖల మీద వివాదం తలెత్తడం కోర్టు జోక్యం చేసుకోవడం అది వేరే విషయం.

అయితే తెలంగాణ వాళ్ళు సైతం జూనియర్ ను గుర్తించగా మనం వదిలేస్తే ఎలా అనుకున్నారో ఏమో మొన్న కొందరు టీడీపీ ప్రతినిధులు జూనియర్ ఇంటికి వెళ్లి హైద్రాబాద్ సభకు రావాలని పిలిచారు. వస్తే ఆయన చంద్రబాబుతో బాటు వేదిక మీద కనిపిస్తారుఇది టీడీపీకి బాగా ఉపకరిస్తుంది.. ఎన్నికల్లో ప్రచారానికి వాడుకోవచ్చు అని టీడీపీ వారు భావించినా చివరలో జూనియర్ అభిప్రాయం మార్చుకున్నట్లు తెలుస్తోంది.

టీడీపీలో ఎన్నటికీ తనకు పెద్ద ప్రాధాన్యం దక్కదు.. పైగా లోకేష్ సారధ్యంలో పనిచేయడమే తప్ప తనకు గుర్తింపు సైతం ఉండదని జూనియర్ గ్రహించి టీడీపీకి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. అంతోటి దానికి రాసుకుని పూసుకుని ఇండస్ట్రీలో తానెందుకు చెడ్డ అవ్వాలని జూనియర్ భావించి తాతయ్య సభకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular