Sunday, December 4, 2022
More
    Homelatest50 వేల మెజార్టీ: పోలింగ్‌ ముగిశాక.. కొనసాగిన KA పాల్‌ కామెడీ

    50 వేల మెజార్టీ: పోలింగ్‌ ముగిశాక.. కొనసాగిన KA పాల్‌ కామెడీ

    విధాత: మునుగోడు ప్రచారం మొదలు పోలింగ్‌ అయిపోయిన తర్వాత కూడా కేఎల్‌ పాల్‌ మానియా సోషల్‌ మీడియాలో మారు మోగుతూనే ఉన్నది. ఇవాళ పోలింగ్‌ కేంద్రాల వద్ద ఆయన పరుగులు, ఆయన గుర్తు ఉంగరం కాబట్టి మీరు అన్నివేళ్లకు ఉంగరాలు ధరించి రావడం ఎన్నికల నియమావళిని ఉల్లఘించినట్టు కాదా? అని ప్రశ్నిస్తే ఆ విలేకరికి దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చారు. టీఆర్‌ఎస్‌ వాళ్లు బయట ముప్పై వేల మంది 30 వేల కార్లలో తిరుగుతున్నారు అయితే వాళ్లు కార్లలో రాకుండా సైకిల్ మీద వస్తారా అంటూ నోర్లు మూయించాడు.

    దీనిపై పొద్దున నుంచి చాలా మీమ్స్‌ వచ్చాయి. అలాగే పోలింగ్‌కు ముందు ఫస్ట్‌ ప్లేస్‌ మనదే అని రెండో ప్లేస్‌లో ఎవరు ఉండబోతున్నారు అని ఆయన అడిగారు. ఆయన చేసే ప్రసంగాలు, డ్యాన్స్‌లు విస్తృతంగా వైరల్‌ అవుతున్నాయి. పోలింగ్‌ అయిపోయాక కూడా పాల్‌ తన కామెడీని ఆపడం లేదు.

    ఉప ఎన్నికలో తనదే గెలుపు అని. 50 వేల మెజారిటీతో తాను గెలువబోతున్నానని ప్రకటించారు. వాస్తవానికి ఆయనకు ఎన్ని ఓట్లు వస్తాయన్నది బ్యాలెట్‌ బాక్సుల్లో నిక్షిప్తమై ఉన్నది. నవంబర్‌ 6న అది తేలుతుంది. కానీ ఆయన మాత్రం తగ్గేదేలే అంటున్నారు. మొత్తానికి కేఏ పాల్‌ కామెడీ ప్రచారం ఇంకా కొన……………. సాగుతున్నది.

    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular

    You cannot copy content of this page