స‌ర‌ద‌గా ముచ్చ‌ట.. సంతోషంలో గౌడ‌లు విధాత, వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రత్యేక ప్రతినిధి: ప్రజాప్రతినిధులు వివిధ కార్యక్రమాలలో భాగంగా పర్యటనలు చేస్తూ అప్పుడప్పుడు కొందరు సమయానుకూలంగా స్పందించే చిన్న చిన్నసంఘటనలు ఆసక్తి కలిగిస్తాయి. వీరు కాసింత చర్చ రేకెత్తిస్తారు. వారికి అవి ఆటవిడుపుగా మారుతాయి. తరచూ నెగటివ్ అంశాలతో వార్తల్లో వ్యక్తిగా ఉండే ఎమ్మెల్యే రాజయ్య దీనికి భిన్నంగా తాటివనంలో కల్లుతాగిన ఆసక్తికర సంఘటన జనగామ జిల్లా జఫర్‌గడ్ మండలంలో జరిగింది. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ […]

  • స‌ర‌ద‌గా ముచ్చ‌ట.. సంతోషంలో గౌడ‌లు

విధాత, వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రత్యేక ప్రతినిధి: ప్రజాప్రతినిధులు వివిధ కార్యక్రమాలలో భాగంగా పర్యటనలు చేస్తూ అప్పుడప్పుడు కొందరు సమయానుకూలంగా స్పందించే చిన్న చిన్నసంఘటనలు ఆసక్తి కలిగిస్తాయి. వీరు కాసింత చర్చ రేకెత్తిస్తారు.

వారికి అవి ఆటవిడుపుగా మారుతాయి. తరచూ నెగటివ్ అంశాలతో వార్తల్లో వ్యక్తిగా ఉండే ఎమ్మెల్యే రాజయ్య దీనికి భిన్నంగా తాటివనంలో కల్లుతాగిన ఆసక్తికర సంఘటన జనగామ జిల్లా జఫర్‌గడ్ మండలంలో జరిగింది.

స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ఒక ప్రారంభోత్సవ కార్యక్రమం నిమిత్తం తన నియోజకవర్గ పరిధిలోని జఫర్ గడ్ మండలం తిమ్మంపేట గ్రామానికి వెళ్లారు. తిమ్మంపేట గ్రామంలో గౌడ సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శిలాఫలకం వేశారు.

స్థానిక గౌడలు ఎమ్మెల్యేను పక్కనే ఉన్న తాటి వనానికి తీసుకెళ్లారు. అక్కడ వనాన్ని సందర్శించిన తర్వాత సరదాగా గౌడలు కల్లు పోయగా రేఖ పట్టి ఎమ్మెల్యే కల్లు తాగారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కల్లు తాగడం ఆసక్తికర చర్చ జరిగింది. స్థానిక గౌడ సంఘం పెద్దలు, గౌడలు సంతోషం వ్యక్తం చేశారు. సంఘం కమ్యూనిటీ హాలు ప్రారంభం రోజు కల్లు గుడాలతో పెద్ద దావతే చేసుకుందామని వ్యాఖ్యానించారు.

Updated On 9 Jan 2023 12:39 PM GMT
krs

krs

Next Story