విధాత‌: మెగాస్టార్ చిరంజీవి మలయాళం లో వచ్చిన లూసీఫర్ చిత్రాన్ని మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ అనే చిత్రంగా తీశారు.ఈ చిత్రం మరి ఆచార్య లాగా డిజాస్టర్ కాకపోయినా సేఫ్ జోన్ తో బయటపడింది. దీనికి యావరేజ్ టాక్ వచ్చింది. కానీ వాస్తవానికి ఈ చిత్రం ఎంతో బాగుంటుంది. ఈ సినిమాలో చిరు కాస్త డిఫరెంట్ పాత్రలో కనిపించారు. అయితే ఆ పాత్రకు చిరు సరిగా సరిపోలేదని నెగటివ్ కామెంట్స్ వినిపించాయి. అయితే ఈ చిత్రానికి […]

విధాత‌: మెగాస్టార్ చిరంజీవి మలయాళం లో వచ్చిన లూసీఫర్ చిత్రాన్ని మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ అనే చిత్రంగా తీశారు.ఈ చిత్రం మరి ఆచార్య లాగా డిజాస్టర్ కాకపోయినా సేఫ్ జోన్ తో బయటపడింది. దీనికి యావరేజ్ టాక్ వచ్చింది. కానీ వాస్తవానికి ఈ చిత్రం ఎంతో బాగుంటుంది. ఈ సినిమాలో చిరు కాస్త డిఫరెంట్ పాత్రలో కనిపించారు. అయితే ఆ పాత్రకు చిరు సరిగా సరిపోలేదని నెగటివ్ కామెంట్స్ వినిపించాయి.

అయితే ఈ చిత్రానికి సక్సెస్ మీట్ ను కూడా జరిపారు. అవకాశం ఉంటే ఈ సినిమా సీక్వెల్ లో కూడా న‌టిస్తాన‌ని చిరు మాట ఇచ్చారు. కానీ వాల్తేరు వీరయ్య విజయంతో చిరు పూర్తి జోష్ లో ఉన్నారు. ఇకపై తన నుంచి ప్రేక్షకులు ఆశించే వాల్తేరు వీరయ్య తరహా మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ చిత్రాలను మాత్రమే చేస్తానని క్లారిటీ ఇచ్చారు.

దాంతో గాడ్ ఫాదర్ సీక్వెల్ ఉండదని అర్థమవుతుంది. తాజాగా ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జెమినీ టీవీలో ప్రసారం చేశారు. ఈ చిత్రానికి జెమినీ టీవీలో కేవలం 7.69 రేటింగ్ మాత్రమే సొంతం చేసుకుంది. అంతకు ముందు కళ్యాణ్ రామ్ నటించిన బింబిసారా చిత్రం మాత్రం గాడ్ ఫాద‌ర్ చిత్రం కంటే చాలా ఎక్కువ రేటింగ్ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం ఏకంగా 11.5 టీఆర్పీ రేటింగ్ ను సొంతం చేసుకోవ‌డం విశేషం.

క‌ళ్యాణ్ రామ్ చిత్రం ఈ రేంజ్ లో టీఆర్పీ రేటింగ్‌ను సాధించ‌డం ఇదే మొద‌టి సారి. అందునా గాడ్ ఫాద‌ర్ ను మించిన రేటింగ్ ను సొంతం చేసుకుంది. ఓటీటీల పుణ్యమా అని శాటిలైట్ చానల్స్ చూసేవారు కూడా తగ్గిపోయారు. అందులో బిగ్ స్టార్స్ నటించే చిత్రాలను చూస్తే వెండితెరపై లేకపోతే ఓటీటీలో చూస్తున్నారు. చిన్న‌, మీడియం రేంజ్ హీరోల చిత్రాల‌ను మాత్ర‌మే వారు టీవీ చానెల్స్ లో వీక్షిస్తున్నారు. పెద్ద హీరోల చిత్రాల‌ను మాత్రం శాటిలైట్ ఛానల్స్ లో చూడటం లేదు. కాబట్టే ఈ విధంగా కళ్యాణ్ రామ్ సినిమా కంటే చిరు సినిమాకు తక్కువ రేటింగ్ వచ్చిందని మరో వాదన వినిపిస్తోంది.

Updated On 31 Jan 2023 4:03 AM GMT
Somu

Somu

Next Story