HomelatestKamalHaasan | శరత్‌బాబు అంత్యక్రియలకు.. కమల్‌హాసన్‌ ఎందుకు హాజరు కాలేదంటే..

KamalHaasan | శరత్‌బాబు అంత్యక్రియలకు.. కమల్‌హాసన్‌ ఎందుకు హాజరు కాలేదంటే..

KamalHaasan |

విధాత‌: శరత్‌బాబు అంత్యక్రియలు మంగళవారం చెన్నైలో నిర్వహించారు. పలువురు సినీ ప్రముఖులు అంత్యక్రియలకు హాజరయ్యారు. కానీ.. శరత్‌బాబుకు అత్యంత సన్నిహితుల్లో ఒకరుగా చెప్పే కమల్‌హాసన్‌ మాత్రం కార్యక్రమానికి హాజరు కాలేదు.

అంతకు ముందు కమల్‌ ట్వీట్‌ చేస్తూ.. ‘గొప్ప నటుడు, గొప్ప స్నేహితుడు శరత్‌బాబు చనిపోయారు. ఆయనతో కలిసి సినిమాల్లో పనిచేసిన సందర్భాలు నా మనసు నిండా ఉన్నాయి. తమిళంలో నా గురునాథ్‌ సినిమా ద్వారా శరత్‌బాబు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.

అనేక అద్భుతమైన పాత్రలు పోషించారు. ఆయనకు నా నివాళి’ అని పేర్కొన్నారు. కానీ.. అంత్యక్రియలకు మాత్రం హాజరు కాకపోవడంతో అనేక మంది ఆశ్చర్యపోయారు. అయితే, కమల్‌హాసన్‌ ఎందుకు రాలేదో ఆయన అన్న కూతురు సుహాసిని మీడియాకు తెలిపారు.

‘రాజ్‌కమల్‌ ఫిలిమ్స్‌ ఇంటర్నేషనల్‌ నుంచి దాదాపు పది మంది ఇక్కడ ఉండి అన్ని విషయాలూ చూసుకుంటున్నారు. కమల్‌ రాలేక పోయారు. ఎందుకంటే ఆయన ఇండియన్‌-2 షూటింగ్‌లో ఉన్నారు. ఇంతకు ముందే ఆయన శరత్‌బాబు కుటుంబీకులతో మాట్లాడారు.

అన్యదా భావించవద్దని కోరారు. తాను మేకప్‌లో ఉన్నానని, బయటకు వచ్చే పరిస్థితిలో లేనని తెలిపారు. శరత్‌బాబుకు ఆరోగ్యం బాలేని మొదటి రోజు నుంచీ ఆయనను కాపాడేందుకు కమల్‌ కృషిచేశారు. రజినీ సర్‌, కమల్‌ సర్‌.. ఇద్దరూ శరత్‌బాబు చికిత్స కోసం ఎంతైన చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

అంత్యక్రియలకు రజిని సర్‌ వచ్చారు. రాలేనందుకు కమల్‌ క్షమాపణలు కోరారు’ అని సుహాసిని వెల్లడించారు. కమల్‌, శరత్‌బాబు ఇద్దరూ కే బాలచందర్‌ దర్శకత్వంలో సాగరసంగమం, ఇది కథకాదు, సత్తం వంటి పలు సినిమాల్లో పనిచేశారు. చివరిసారిగా అలవంధన్‌ సినిమాలో కనిపించారు.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular