Tuesday, January 31, 2023
More
  Homelatestకామారెడ్డి: మాస్టర్‌ ఫ్లాన్‌ రగడ.. ఆత్మహత్యకు యత్నించిన మరో రైతు

  కామారెడ్డి: మాస్టర్‌ ఫ్లాన్‌ రగడ.. ఆత్మహత్యకు యత్నించిన మరో రైతు

  • ఎక‌రం భూమి గ్రీన్ జోన్‌లో పోతుంద‌ని మ‌న‌స్తాపం
  • చికిత్స పొందుతున్న బాలకృష్ణ
  • 2వ వార్డులో ఘటన

  విధాత, నిజామాబాద్: కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని రామేశ్వర్ పల్లి గ్రామానికి (2వ వార్డు) చెందిన రైతు మర్రి బాలకృష్ణ మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. వెంటనే అతడిని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలకృష్ణ ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు.

  గ్రామస్తుల కథనం మేరకు బాలకృష్ణకు గ్రామంలో ఎకరం భూమి వుంది. గ్రీన్ జోన్‌లో తనకున్న భూమి కోల్పోతున్నట్లుగా భావించిన బాలకృష్ణ చేను వద్ద పురుగుల మందు సేవించిగా ఇరుగు పొరుగు వారు గుర్తించారు.

  కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో అంబులెన్సు ద్వారా ఆసుపత్రికి తరలించారు. బీజేపీ నాయకుడు కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆసుపత్రికి వెళ్లి బాలకృష్ణను పరామర్శించారు. ఆత్మహత్యకు పాల్పడ వద్దని ధైర్యం చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు ఆసుపత్రి వద్దకు వచ్చారు.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular