విధాత‌: ఒకప్పుడు దక్షిణాదిలో కూడా కన్నడ చిత్రాలంటే చిన్నచూపు ఉండేది. కానీ కాశీ విశ్వనాథ్ తీసిన పెద్ద‌ల చిత్రాలు, ఉపేంద్ర తీసిన రెబెల్ చిత్రాలు, సాయికుమార్ న‌టించిన ప‌వ‌ర్ ఫుల్ చిత్రాలు మాత్ర‌మే తెలుగులో విడుద‌ల అయ్యేవి. ఇలాంటి చిత్రాలకు తెలుగులో బాగానే ఆదరణ ద‌క్కేది. కొంతకాలం థ్రిల్లర్ మంజు కూడా తన చిత్రాలతో అలరించారు. కానీ ఆ తరువాత కన్నడ పరిశ్రమ నుంచి తెలుగులోకి ఎవరు రాలేదు. హీరోయిన్లు తప్ప ఇక్కడికి హీరోలు వచ్చి హ‌వా […]

విధాత‌: ఒకప్పుడు దక్షిణాదిలో కూడా కన్నడ చిత్రాలంటే చిన్నచూపు ఉండేది. కానీ కాశీ విశ్వనాథ్ తీసిన పెద్ద‌ల చిత్రాలు, ఉపేంద్ర తీసిన రెబెల్ చిత్రాలు, సాయికుమార్ న‌టించిన ప‌వ‌ర్ ఫుల్ చిత్రాలు మాత్ర‌మే తెలుగులో విడుద‌ల అయ్యేవి. ఇలాంటి చిత్రాలకు తెలుగులో బాగానే ఆదరణ ద‌క్కేది.

కొంతకాలం థ్రిల్లర్ మంజు కూడా తన చిత్రాలతో అలరించారు. కానీ ఆ తరువాత కన్నడ పరిశ్రమ నుంచి తెలుగులోకి ఎవరు రాలేదు. హీరోయిన్లు తప్ప ఇక్కడికి హీరోలు వచ్చి హ‌వా సాగించడం చూడలేదు. ఇలాంటి సందర్భంలో కేజీఎఫ్ ఫ్రాంచైజీగా వ‌చ్చిన కేజీఎఫ్ చాప్ట‌ర్ 1, 2 చిత్రాలు చ‌రిత్ర‌ను తిర‌గ‌రాశాయి.

ఈ చిత్రాలతో పాటు కాంతారా చిత్రం కన్నడ పరిశ్రమ సత్తాను చాటి చెప్పింది. ఈ చిత్రాలు దేశ విదేశాలలో కూడా చరిత్ర సృష్టించాయి. దీంతో ఇప్పుడు అందరి దృష్టి కన్నడ పరిశ్రమపై పడింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా కన్నడ పరిశ్రమ హాట్ టాపిక్ అయ్యింది. కన్నడలో సూపర్ హిట్‌ అయిన చిత్రాలను ఇతర భాషల్లో డ‌బ్ చేయడానికి నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.

కొంతమంది కన్నడ సినిమాలని పాన్ ఇండియా సినిమాలుగా రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కన్నడ స్టార్ ఉపేంద్ర హీరోగా రెండు సినిమాలు పాన్ ఇండియా లెవెల్‌లో తెరకెక్కుతున్నాయి. కబ్జా అనే సినిమాలో ఉపేంద్రతో పాటు కిచ్చా సుదీప్ నటిస్తున్నారు. మరో సినిమాలో ఉపేంద్ర ఒక్కడే కీలకపాత్రలో నటిస్తున్నారు.

ఇక అర్జున్ సర్జా మేనల్లుడు దుర్వాసన అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవువుతున్నాడు. హొం బ‌లే ఫిలిమ్స్ శ్రీమురళీ హీరోగా భగీర అనే సినిమా చేస్తోంది. ఇలా వరుస ఆసక్తికర ప్రాజెక్టుల‌తో కన్నడ పరిశ్రమ వారు తమ చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. గత ఏడాది విడుదలైన చార్లీ 777, కాంతారా చిత్రాలు ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి.

మొత్తానికి ఈ ఏడాది కూడా కన్నడ సినిమా పరిశ్రమ నుంచి మరిన్ని హిట్లు వచ్చే అవకాశం ఉందని కన్నడ చిత్రాలు ఈ ఏడాది కూడా దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి క్రేజ్ సాధించుకునే అవకాశం కనిపిస్తున్నాయని అంటున్నారు.

కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్‌తో సలార్ చేస్తున్నారు. మళయాళ స్టార్‌ పృథ్వీరాజ్ హీరోగా హొం భలే సంస్థ మరో సినిమా చేస్తోంది. ఇవన్నీ చూస్తుంటే కన్నడ నుంచి వచ్చే సినిమాలు సూపర్ హిట్‌గా నిలబడే అవకాశాలు ఉన్నాయ‌నిపిస్తోంది..!.

Updated On 25 Jan 2023 12:29 PM GMT
krs

krs

Next Story