విధాత, మెదక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 18 నుండి నిర్వహించే కంటి వెలుగు రెండవ విడత కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసికట్టుగా ప‌నిచేసి విజయవంతం చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సూచించారు. మనోహరాబాద్ మండలం శుభం ఫంక్షన్ హాల్ లో సోమవారం నిర్వ‌హించిన రెండవ విడత కంటి వెలుగు అవగాహన కార్యక్రమంలో ఆయ‌న పాల్గొని, మాట్లాడారు. రాష్ట్రంలో ఎవరు కూడా దృష్టి లోపంతో బాధ‌పడకూడదన్న […]

విధాత, మెదక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 18 నుండి నిర్వహించే కంటి వెలుగు రెండవ విడత కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసికట్టుగా ప‌నిచేసి విజయవంతం చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సూచించారు.

మనోహరాబాద్ మండలం శుభం ఫంక్షన్ హాల్ లో సోమవారం నిర్వ‌హించిన రెండవ విడత కంటి వెలుగు అవగాహన కార్యక్రమంలో ఆయ‌న పాల్గొని, మాట్లాడారు. రాష్ట్రంలో ఎవరు కూడా దృష్టి లోపంతో బాధ‌పడకూడదన్న ధ్యేయంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించార‌న్నారు.

మొదటి విడతలో 1కోటి 54 లక్షల మందికి కంటి పరీక్షలను నిర్వహించి 50 లక్షల మందికి ఉచితంగా కళ్లద్దాలను అందించామ‌న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలోని గ్రామ పంచాయ‌తీ, మున్సిపల్ వార్డులలో జనవరి 18 నుంచి కంటివెలుగు రెండవ విడత కార్యక్రమాన్ని 250 కోట్ల రూపాయలతో నిర్వహించడం జరుగుతుందన్నారు.

ఇందుకు గాను 1500 బృందాలు 100రోజుల పనిదినాలలో ఉదయం 09:00 గంటల నుండి సాయంత్రం 04:00 గంటల వరకు క్యాంపును నిర్వహించేలా ప్రణాళికను రూపొందించుకోవాల‌ని సూచించారు. గతంలో 827 బృందాలు కంటి వెలుగులో పనిచేయగా, ఇప్పుడు ఆ సంఖ్యను 1500కు పెంచామ‌న్నారు.

ప్రతి క్యాంపులో ఒక‌ మెడికల్ అధికారి, ఒక‌ అప్తామాలజిస్టు, ఇద్ద‌రు ఏఎన్ఎం లు, ముగ్గురు ఆశాలు, ఒక‌ డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉంటారన్నారు. క్యాంపు నిర్వ‌హించే బృందం స్థానికంగా ఉండేలా వారికి వసతి, భోజనం కోసం రోజుకు 1500 రూపాయలను అందించనున్న‌ట్టు తెలిపారు.

క్యాంపు దగ్గ‌ర అన్ని వ‌స‌తుల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఏర్పాటు చేయాల‌ని సూచించారు. పూర్తిగా ఆన్ లైన్ స్క్రీనింగ్, కంప్యూటరైజ్డ్ ఐ టెస్ట్ ను నిర్వహించనున్న‌ట్టు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా రాష్ట్ర స్థాయిలో 10 క్వాలిటీ కంట్రోల్ టీం లను, జిల్లా స్థాయిలో ఒక టీమ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని ఈ టీం ఎప్పటికప్పుడు పర్యవేక్షించి నివేదికను అందిస్తారని తెలిపారు.

కంటి వెలుగు బృందం ఇప్పటికే ఎల్.వి. ప్రసాద్, డా. సరోజిని కంటి ఆసుపత్రులలో శిక్షణ కూడా తీ
కున్న‌ట్టు తెలిపారు. సోమవారం నుండి శుక్రవారం వరకు ఖచ్చితంగా క్యాంపు నిర్వహించాలని, ఆ దిశగా జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించాలని తెలిపారు. సాధారణ వైద్యసేవలకు అంతరాయం కలుగకుండా 929 డాక్టర్ లను నియమించడం జరిగిందని, కంటివెలుగు కార్యక్రమాన్ని ఎక్కడ ఎప్పుడు నిర్వహిస్తారనే పూర్తి సమాచారాన్ని ప్రజలకు చేరేలా చూడాలని అన్నారు.

కార్యక్రమ నిర్వహణపై గ్రామ పంచాయ‌తీ, మునిసిపల్, వార్డు స్థాయిలో మండల పరిషత్‌ అధికారులు మండల ప్రత్యేక అధికారులు zptc,mptc, mpp, sarpanch, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం నిర్వహించాలని సూచించారు.

శిభిరంలో కంటిపరీక్షలు పూర్తయిన వెంటనే రీడింగ్ అద్దాలను అందించనున్న‌ట్టు తెలిపారు. ఇందుకోసం 60 లక్షలు రీడింగ్ అద్దాలను, ప్రిస్క్రీష్షన్ అద్దాలను సిద్ధం చేశామ‌న్నారు.

కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ర్యాకల హేమలత శేఖర్ గౌడ్, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు మదన్ రెడ్డి పద్మాదేవేందర్ రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, చైర్మన్ ప్రతాపరెడ్డి, జిల్లా గ్రంధాల సంస్థ అధ్యక్షులు చంద్ర గౌడ్, జిల్లా కలెక్టర్ హరీష్ , అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, తదితర ప్రజా ప్రతినిధులు, అధికారులు, వైద్యులు పాల్గొన్నారు

Updated On 9 Jan 2023 12:11 PM GMT
krs

krs

Next Story