Karimnagar | భార్య దుస్తులు ధరించి కళ్లుగప్పే యత్నం పట్టించిన సీసీ ఫుటేజీ దృశ్యాలు యువకుడి అరెస్టు విధాత బ్యూరో, కరీంనగర్: మహిళ వేషంలో చోరీకి పాల్పడినా, చివరకు పోలీసులకు పట్టుబడక తప్ప లేదు. జల్సాలకు అలవాటు పడిన ఓ యువకుడు తాను నివాసం ఉంటున్న భవన సముదాయంలోనే దొంగతనానికి యత్నించాడు. గుట్టు బయట పడకుండా ఉండేందుకు భార్య దుస్తులు ధరించి మరీ చోరీకి పాల్పడ్డాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఈ ఘటన […]

Karimnagar |
- భార్య దుస్తులు ధరించి కళ్లుగప్పే యత్నం
- పట్టించిన సీసీ ఫుటేజీ దృశ్యాలు
- యువకుడి అరెస్టు
విధాత బ్యూరో, కరీంనగర్: మహిళ వేషంలో చోరీకి పాల్పడినా, చివరకు పోలీసులకు పట్టుబడక తప్ప లేదు. జల్సాలకు అలవాటు పడిన ఓ యువకుడు తాను నివాసం ఉంటున్న భవన సముదాయంలోనే దొంగతనానికి యత్నించాడు. గుట్టు బయట పడకుండా ఉండేందుకు భార్య దుస్తులు ధరించి మరీ
చోరీకి పాల్పడ్డాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
చోరీకి సంబంధించిన దృశ్యాలు దుకాణంలోని సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో పోలీసులు 48 గంటల్లోనే కేసును ఛేదించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన రామిండ్ల సుధీర్.. అదే గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ ఫ్లెక్సీ ప్రింటర్స్ లో చోరీకి పాల్పడినట్లు ఎస్సై రమాకాంత్ తెలిపారు.
మండల పరిధిలోని సింగారం గ్రామానికి చెందిన గనగోని బంటి లక్ష్మీనారాయణ ఫ్లెక్సీ పేరిట మండల కేంద్రంలో ఫ్లెక్సీ ప్రింటింగ్ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. ఎప్పటి లాగానే ఈ నెల 9న రాత్రి దుకాణానికి తాళం వేసి ఇంటికి వెళ్లాడు. 11న ఉదయం దుకాణానికి వచ్చి చూడగా, వెనుక ఉన్న తలుపు తీసి కనిపించింది.
కౌంటరులోని రూ.3500 నగదు అపహరణకు గురైందని గమనించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ రమాకాంత్ ఆధ్వర్యంలోని పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాలను పరిశీలించారు. చోరీకి పాల్పడింది మొదట యువతిగా భావించారు.
ఆ తరువాత అనుమానం వచ్చిన పోలీసులు సుధీర్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. తానే తన భార్య దుస్తులు ధరించి దొంగతనానికి పాల్పడ్డానని అతను అంగీకరించాడు. దీంతో సుధీర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు.
