BJP, BSNL, JIO, 4G, 5G, KARNATAKA
కర్ణాటక పోలీస్ శాఖకు ప్రభుత్వం సర్క్యులర్
విధాత: ఆదుకోవాల్సిన తల్లిదదండ్రులే బిడ్డను గాలికి వదిలేస్తే ఇలాగె ఉంటుంది.. దేశం .. ధర్మం.. భారతీయత అంటూ ఏదేదో మాట్లాడే బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఒక్కోదాన్ని అమ్ముతూ పోవడమే పనిగా పెట్టుకున్నారు. విశాఖ ఉక్కును పోర్టులను అమ్మేయడానికి తెగబడిన కేంద్రం ఇప్పుడు మెల్లగా భారత సంచార నిగమ్ లిమిటెడ్ (BSNL)ను సైతం మెల్లగా నిర్వీర్యం చేసేసి దాన్ని సైతం ప్రయివేట్ సంస్థలకు అమ్మేసేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఉదాహరణకు చూస్తే కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ
పోలీస్ శాఖలో ఉన్న దాదాపు 38,000 BSNL కనెక్షన్లను వెంటనే రిలయన్స్ జియోలోకి మార్చాలని ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. ఒకే సారి BSNL 39వేల కనెక్షన్లు కోల్పోవడం అంటే మాటలు కాదు. 5జీ నెట్‌వర్క్ లేకపోవడం వల్లే జియోలోకి మారిపోతున్నట్లు పోలీస్ శాఖ చెప్తోంది. మరి కేంద్రంలోనీ BJP.. BSNLకు ఎందుకు 5జీ లైసెన్స్ ఇవ్వదు. నెట్‌వర్క్ విస్తరణ ఎందుకు చేపట్టదనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
కేంద్రంలో అధికారంలో ఉన్న BJP కావాలనే అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభుత్వ సంస్థ BSNLకు ఇవ్వకుండా పాత 3G, 4G టెక్నలాజీ మీద ఆధారపడేలా చేయడం, చివరికి అది పనికిరాని సంస్థగా మార్చేసి ప్రయివేటు సంస్థలకు అమ్మేయడం పనిగా పెట్టుకున్నట్లు ఇలాంటివి చూస్తేనే అర్థం అవుతోంది.
దేశవ్యాప్తంగా లక్షల కోట్ల ఆస్తులు, భారీ టవర్లు, ఇతరత్రా భూములు, భవనాలు మారుమూల సైతం నెట్వర్క్ అందించే ఈ బీఎస్ఎన్ఎల్ ను సైతం మెల్లగా చంపేసేందుకు ఇలా ఒకేసారి వేలాది కనెక్షన్లు ప్రైవేటుకు బదలాయిస్తున్నారు అని చెప్పకనే తెలుస్తోంది. అవును.. BSNLకు 5G పరిజ్ఞానం లేదని జియో వైపు మారుతున్నట్లు చెబుతున్నారు.. మరి అధికారంలో మీరే కదా ఉన్నారు.. 5G ఎందుకు ఇవ్వలేదు.. ఎవరు వద్దన్నారు..
కుక్కని చంపాలంటే ముందు దానికి పిచ్చి ఉందని ముద్ర వేయాలి. అలాగే BSNL ఎంత నష్టాల్లోకి పోతే అంత త్వరగా అమ్మేయవచ్చు. అచ్చం ఇలాగె ఎయిర్ ఇండియాను అమ్మేశారు.. ఇక BSNL వంతు ఎప్పుడో మరి..?