Karnatala |
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. ఇప్పటికే 5 హామీలను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. ఓటర్లను ఆకర్షించే విధంగా తాజాగా మేనిఫెస్టోను విడుదల చేసింది కాంగ్రెస్. గృహ జ్యోతి, గృహ లక్ష్మి, అన్న భాగ్య, యువ నిధి, శక్తి వంటి హామీలను కర్ణాటక ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. తాజాగా ఆవు పేడ కొంటాం.. బజరంగ్‌దళ్, పీఎఫ్ఐలపై నిషేధం విధిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
Smt @priyankagandhi leading a massive roadshow in Chintamani, Karnataka#CongressForProgress pic.twitter.com/oT8s3ZiLjr
— Manickam Tagore .B🇮🇳✋மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) May 2, 2023
కర్ణాటక రాజధాని బెంగళూరులోని హోటల్ సాంగ్రిలాలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ డాక్టర్ పరమేశ్వరజీ, రణదీప్ సింగ్ సూర్జేవాలాతో పాటు పలువురు నాయకులు కలిసి కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇవాళ విడుదల చేసిన మేనిఫెస్టో కేవలం వాగ్దానం మాత్రమే కాదని, కర్ణాటక ప్రజలకు మంచి భవిష్యత్, సత్వర అభివృద్ధి కోసం అని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోలోని కొన్ని ముఖ్యాంశాలు..
- గృహలక్ష్మి యోజన ద్వారా కుటుంబంలోని ప్రతి మహిళకు నెలకు రూ. 2 వేలు
- శక్తి యోజన ద్వారా సాధారణ కేఎస్ఆర్టీసీ, బీఎంటీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
- యువనిధి యోజన ద్వారా నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు నెలకు రూ. 3 వేలు, డిప్లొమా హోల్డర్లకు నెలకు రూ. 1500
- అన్నభాగ్య యోజన కింద 10 కిలోల బియ్యం
- గృహ జ్యోతి యోజన ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్
- బజరంగ్ దళ్, పీఎఫ్ఐ వంటి సంస్థలపై నిషేధంతో పాటు చట్ట ప్రకారం చర్యలు
- ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలు/లింగాయత్‌లు, వొక్కలిగాలకు రిజర్వేషన్లను 50 శాతం నుంచి 75 శాతానికి పెంపు
- పాలపై సబ్సిడీ రూ.5 నుంచి రూ.7కు పెంపు
- 2006 నుంచి ప్రభుత్వ ఉద్యోగులందరికీ పాత పెన్షన్ స్కీం అమలు
- అంగన్‌వాడీ కార్యకర్తల వేతనం రూ. 11,500 నుంచి రూ. 15 వేలకు పెంపు
- నైట్ డ్యూటీ పోలీసులకు ప్రతి నెల రూ. 5 వేలు
- భారత్ జోడో కోసం సామాజిక సామరస్య కమిటీ ఏర్పాటు
- అవినీతిపై కఠిన చర్యలకు ప్రత్యేక చట్టం
- బీజేపీ చేసిన ప్రజావ్యతిరేక చట్టాలన్నీ ఏడాదిలోగా ఉపసంహరణ
- రైతు వ్యతిరేక చట్టాల ఉపసంహరణ
- రైతులపై పెట్టిన కేసులు వెనక్కి
- వచ్చే 5 ఏళ్లలో రైతు సంక్షేమానికి రూ.1.5 లక్షల కోట్లు
Addressed public gathering in #Bhalki today.
Let us join hands for change.
Let us join hands for a better Karnataka. #VoteForCongress#CongressForProgress📍Bhalki pic.twitter.com/LHlnnELnoO
— Revanth Reddy (@revanth_anumula) May 2, 2023