Karnataka
- కాంగ్రెస్‌ను గెలిపించండి.. అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తాం
- బీజేపీ 40శాతం కమీషన్ల సర్కార్
- కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి
- నాలుగు సభల్లో ప్రసంగించిన రేవంత్-ప్రసంగాలకు కన్నడిగుల నుంచి భారీ స్పందన
విధాత: కన్నడిగులంతా కాంగ్రెస్ వెంటే ఉన్నారని పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నారు. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్, బాల్కి, బసవ కళ్యాణ్, హుంనాబాద్ నియోజక వర్గాలలో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో పాల్గొన్నారు.
కన్నడిగులను ప్రశంసలతో ముంచెత్తుతూ రేవంత్ చేసిన ప్రసంగాలకు సభికుల నుంచి భారీ స్పంధన వచ్చింది. ఈ సభలల్లో రేవంత్ మాట్లాడుతూ ‘‘గుజరాతీలు నరేంద్ర మోడీ, అమిత్ షాల వెంట ఉన్నారు, మరి మనం కర్ణాటక వాళ్లం మన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే వెంట ఉండాలి కదా.. ఏఐసీసీ జాతీయ అధ్యక్షులుగా మన పూర్వ హైదరాబాద్ కర్ణాటక బిడ్డ మల్లికార్జున్ ఖర్గేకు అవకాశం వచ్చింది, మనమంతా ఆయన వెంట ఉండి కర్ణాటకలో కాంగ్రెస్ కు 150 సీట్లు గెలిపించి ఘన విజయం సాధించి పెట్టాలి’’ అని టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ, కర్ణాటక ఎన్నికల స్టార్ కంపెయినర్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
Addressed public gathering in #Bhalki today.
Let us join hands for change.
Let us join hands for a better Karnataka. #VoteForCongress#CongressForProgress📍Bhalki pic.twitter.com/LHlnnELnoO
— Revanth Reddy (@revanth_anumula) May 2, 2023
మల్లికార్జున్ ఖర్గే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకులని ఆయన 9 సార్లు అసెంబ్లీకి 2 సార్లు పార్లమెంట్ కు ఎన్నికయ్యారన్నారు. ఆయన రాజకీయానుభవం అపారమైందని అలాంటి నాయకుడైన మన కర్ణాటక బిడ్డను గెలిపించి మన ఆత్మగౌరవాన్ని చాటుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆత్మగౌరవంతో బతుకుతామన్నారు. లేక పోతే 40శాతం కమీషన్ల రాష్ట్రమా అని ఎద్దేవా చేస్తారన్నారు.
బీజేపీ ఇంతకాలం 40 శాతం కమిషన్లు తీస్కొని పనులు చేసిందన్నారు. కర్ణాటక వాళ్లు బయటకు వెళ్లి మాది కర్ణాటక అని చెపితే 40 శాతం కమిషన్లు తీసుకునే రాష్ట్రమా అని ఎద్దేవా చేస్తారని అందుకోసం నిజాయితీ గా పనిచేసే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని రేవంత్ కన్నడ ప్రజలను కోరారు. ఈ సందర్భంగా పలు సభలలో ఏఐసీసీ అధ్యక్షులు మలికార్జున్ ఖర్గే, ఏఐసీసీ కార్యదర్శి శ్రీధర్ బాబు కూడా పాల్గొన్నారు.
LIVE: Public meeting at Bhalki, Karnataka.
We are strongly committed to the welfare and well-being of our people. Karnataka shall witness a new dawn, soon. #CongressBaralidePragatiTaralidehttps://t.co/sIwyknxhbU
— Mallikarjun Kharge (@kharge) May 2, 2023
Karnataka | కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల.. ఆవు పేడ కొంటాం.. బజరంగ్‌దళ్‌ను నిషేధిస్తాం..