HomelatestKarnataka Politics | అవకాశ వాద రాజకీయాలకు చెక్‌ పెట్టిన కన్నడిగులు

Karnataka Politics | అవకాశ వాద రాజకీయాలకు చెక్‌ పెట్టిన కన్నడిగులు

Karnataka Politics

  • దారుణంగా దెబ్బతిన్న జేడీఎస్‌
  • గత ఎన్నికల కంటే.. ఈసారి 18 సీట్ల‌కే ప‌రిమిత‌మైన జేడీఎస్‌
  • కుమార స్వామి కుమారుడు నిఖిల్‌ ఓటమి

విధాత: కన్నడ ప్రజలు అవకాశ వాద రాజకీయాలకు చెక్‌ పెట్టారు. కొన్ని సీట్లు సంపాదించుకొని ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీతో బేరాలు కుదుర్చుకునే పద్దతికి ప్రజలే చరమ గీతం పాడారు. అవకాశ వాద రాజకీయాలకు, బేరసారాలకు పెట్టింది పేరుగా ఉన్న జేడీఎస్‌ను కన్నడ ప్రజలు తిరస్కరించారు.

2018 ఎ\న్నికల్లో 37 సీట్లలో గెలిపించిన కన్నడిగులు ఈ ఎన్నికల్లో కేవలం 18 సీట్లకే పరిమితం చేశారు. జేడీఎస్‌ అధినేత కుమారస్వామి తనయుడు నిఖిల్‌ కుమారస్వామిని కూడా కన్నడ ప్రజలు ఓడించారు.
కింగ్‌ మేకర్‌ కావాలని ఆశించిన కుమారస్వామికి కన్నడిగులు గట్టి షాక్‌ ఇచ్చారు. అవకాశ వాద రాజకీయాలు, క్యాంప్‌ రాజకీయాలతో విసిగిపోయిన ప్రజలు ఒకే పార్టీకి పట్టం కట్టారు. దీంతో జేడీఎస్‌ను ఎన్నికల ఫలితాల తరువాత పలుకరించే వారే కరువయ్యారు.

వాస్తవంగా పోలింగ్‌ పూర్తి కాగానే జేడీఎస్‌ అధినేత కుమార స్వామిని బీజేపీ లైన్‌లోకి తీసుకున్నది. కాంగ్రెస్‌ పార్టీకి మ్యాజిక్‌ ఫిగర్‌ కంటే ఒకటి రెండు సీట్లు తక్కువగా వస్తాయని అంచనా వేసిన బీజేపీ కుమార స్వామితో బేరసారాలకు దిగినట్లు సమాచారం. అయితే ఫలితాలు తారు మారు కావడంతో అంతా గప్‌ చుప్‌ అయ్యారు.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular