HomelatestKarnataka win | కాంగ్రెస్‌కు అభినందనలు.. BJP ఓటర్లకు ధన్యవాదాలు: మోడీ

Karnataka win | కాంగ్రెస్‌కు అభినందనలు.. BJP ఓటర్లకు ధన్యవాదాలు: మోడీ

Karnataka win
విధాత: కర్ణాటకలో విజయం సాధించిన కాంగ్రెస్‌కు మోడీ అభినందనలు చెప్పక తప్పలేదు. వాస్తవానికి కర్ణాటకలో ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి బిజెపి పెద్ద యుద్ధమే చేసింది. అమిత్ షా.. మోడీ.. తదితరులు బెంగళూరులో తిష్ట వేసి రోడ్ షో … ప్రసంగాలు.. ఓటర్లతో భేటీలు… ఇంకా రాజకీయ వ్యూహాలు… ప్రతి వ్యూహాలు… ఎత్తులు.. పై ఎత్తులు వేశారు. కానీ… వర్కవుట్ కాలేదు..

అక్కడ 136 స్థానాలతో కాంగ్రెస్ విజయం సాధించగా బిజెపి కేవలం 64 స్థానాలకు పరిమితమైంది. మోడీ వస్తే మొత్తం పరిస్థితి మారుతుంది.. ఓటర్లు తమకు పోటెత్తుతారు అని బీజేపీ భావించింది.. అనుకున్నట్లే జనం ఐతే సభలకు బానే వచ్చారు కానీ ఓట్లు రాలేదు.. దీంతో కాంగ్రెస్ గెలిచింది.. డీకే శివకుమార్… సిద్ధరామయ్య వంటి వాళ్ళు కష్టపడడం… గత బిజెపి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పోగవడంతో దాన్ని తుడిచివేస్తూ కొత్తగా ప్రజల్లో నమ్మకాన్ని పొందడం బిజెపికి కష్టమైంది.

దీంతో ఓటమిని ఆహ్వానించక తప్పలేదు. కాంగ్రెస్‌ను అభినందిస్తూ ట్వీట్ చేసిన మోడీ.. తమకు మద్దతు పలికిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. కర్ణాటక అభివృద్ధికి కేంద్రం నుంచి తమవంతు సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular