Saturday, April 1, 2023
More
    HomelatestBride Makeup | బెడిసికొట్టిన వ‌ధువు మేక‌ప్.. పెళ్లిని ర‌ద్దు చేసిన వ‌రుడు

    Bride Makeup | బెడిసికొట్టిన వ‌ధువు మేక‌ప్.. పెళ్లిని ర‌ద్దు చేసిన వ‌రుడు

    Bride Makeup | పెళ్లి అన‌గానే నూత‌న వ‌ధూవ‌రులు మేక‌ప్‌కు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఇక మూడు రోజుల ముందు నుంచే మేక‌ప్ వేసుకోవ‌డం మొద‌లు పెడుతారు. వివాహ వేదిక‌( Marriage Function )పై అందంగా క‌నిపించేందుకు మేక‌ప్ వేసుకుంటారు.

    ఆ మాదిరిగానే ఓ యువ‌తి కూడా మేక‌ప్ వేసుకుంది. కానీ అది బెడిసికొట్టింది. మేక‌ప్ వేసుకున్న త‌ర్వాత ఆమె ముఖం వాచిపోవ‌డంతో వ‌రుడు పెళ్లిని ర‌ద్దు చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌( Karnataka )లోని హాస‌న్( Hasan ) జిల్లాలో వెలుగు చూసింది.

    వివ‌రాల్లోకి వెళ్తే.. హాస‌న్ జిల్లాలోని అరాసికేరి గ్రామానికి చెందిన ఓ యువ‌తికి పెళ్లి నిశ్చ‌య‌మైంది. ఈ క్ర‌మంలో పెళ్లి ఒక రోజు ముందు ఆమె స్థానికంగా ఉన్న ఓ బ్యూటీ పార్ల‌ర్‌( beauty parlour )కు వెళ్లింది. వ‌ధువుకు ఫౌండేష‌న్ వేసిన త‌ర్వాత ముఖానికి స్టీమ్ ప‌ట్టింది.

    దీంతో ఆవిడ ముఖం న‌ల్ల‌గా మారిపోయి, వాచిపోయింది. వ‌ధువు( Bride )ను చూసిన వ‌రుడు( Bride Groom ) షాక్‌కు గుర‌య్యాడు. త‌న‌కు ఈ పెళ్లి వ‌ద్ద‌ని వ‌రుడు చెప్పాడు. దీంతో వ‌ధువు కుటుంబ స‌భ్యులు ఆందోళ‌న‌కు గుర‌య్యారు. బ్యూటీ పార్ల‌ర్ ఓన‌ర్ గంగ‌పై వ‌ధువు కుటుంబ స‌భ్యులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

    spot_img
    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular