Kashmira Pardeshi | కశ్మీరా పరదేశి..ఈ మరాఠి ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకి కూడా చాలా సుపరిచితం. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ తెలుగులోకి నర్తనశాల చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. తమిళంలో శివప్పు మంజల్ పచ్చై (2019) అనే చిత్రంలో తొలిసారిగా నటించింది. ఈ అమ్మడు సొగసైన ఒంపుసొంపులతో అభిమానుల మనసులు దోచేస్తుంది. మరాఠీ బ్యూటీ కశ్మీరా పరదేశి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా తన […]

Kashmira Pardeshi |
కశ్మీరా పరదేశి..ఈ మరాఠి ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకి కూడా చాలా సుపరిచితం. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ తెలుగులోకి నర్తనశాల చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. తమిళంలో శివప్పు మంజల్ పచ్చై (2019) అనే చిత్రంలో తొలిసారిగా నటించింది. ఈ అమ్మడు సొగసైన ఒంపుసొంపులతో అభిమానుల మనసులు దోచేస్తుంది.
మరాఠీ బ్యూటీ కశ్మీరా పరదేశి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా తన ఇన్‌స్టాలో ఓ వీడియో షేర్ చేయగా, ఇది నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఆరెంజ్ కలర్ ఔట్ ఫిట్‌లో తన ఎద అందాలతో పాటు థైస్ అందాలు కూడా చూపిస్తూ కుర్రాళ్లని కుదురుగా ఉండనివ్వడం లేదు. కశ్మీరా పరదేశిని ఇలా చూసి మైండ్ బ్లాక్ అవుతుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
కశ్మీరా పరదేశి మిషన్ మంగల్.. రైడర్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం సరసన వినరో భాగ్యము విష్ణు కథ చిత్రంలో నటించి మంచి హిట్ అందుకుంది. ప్రస్తుతం పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీగా ఉంది. తెలుగులో పెద్దగా అవకాశాలు లేని ఈ అమ్మడు తమిళంలో మాత్రం అవకాశాలు అందుకుంటూ వస్తుంది.
కశ్మీరా పదేశి మహారాష్ట్ర రాజధాని ముంబైలోని మరాఠీ కుటుంబంలో జన్మించింది. పూణేలోని సెయింట్ ఆన్స్ స్కూల్‌లో పాఠశాల విద్యను, బృహన్ మహారాష్ట్ర కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో కళాశాల విద్యను పూర్తి చేసింది. ముంబైలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ఫ్యాషన్ డిజైన్ పూర్తి చేసింది.
సినీ రంగంలోకి రావడానికి ముందు కశ్మీరా పరదేశి అనేక వాణిజ్య ప్రకటనలలో నటించి అలరించింది. ఈ అమ్మడు 2018లో నాగశౌర్య హీరోగా తెలుగులో వచ్చిన నర్తనశాల సినిమాతో తన సినీ కెరియర్‌ని ప్రారంభించింది. తొలి సినిమానే ఈ అమ్మడికి పెద్ద దెబ్బ కొట్టింది.
అనంతరం 2019లో మిషన్ మంగళ్ అనే హిందీ సినిమాలో విద్యాబాలన్ -సంజయ్ కపూర్ కుమార్తెగా నటించి ఎంతగానో అలరించింది. ఇక రవి జాదవ్ తీసిన రాంపట్ (2019) చిత్రంతో మరాఠీ సినిమా రంగంలోకి అడుగుపెట్టింది.
జివి ప్రకాష్ కుమార్ సరసన శివప్పు మంజై పచ్చై (2019) అనే తమిళ సినిమాలో నటించింది. ఇక నిఖిల్ కుమార్ సరసన రైడర్ (2021) సినిమాతో కన్నడ సినిమారంగలోకి కూడా ప్రవేశించింది. ఇలా పలు భాషలలో తెగ సందడి చేస్తుంది.
