విధాత: ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scan)లో ఎమ్మెల్సీ కవిత (MLC Kavith)కు జారీ అయిన ఈడీ నోటీసులపై సీఎం కేసీఆర్ (CM KCR) స్పందించారు. ఈ వ్యవహారంలో కవితను రేపు అరెస్టు చేయొచ్చు అని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అరెస్టు చేసుకుంటే చేసుకోని… అందర్నీ వేధిస్తున్నారు అని మండిపడ్డారు. భయపడేది లేదు.. పోరాటం వదిలేది లేదు.. రాబోయే ఎన్నికల్లో బీజేపీని లేకుండా చేద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
కేంద్రంలోని బీజేపీ ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెడుతుందన్నారు సీఎం కేసీఆర్. మంత్రులు, ఎంపీలతో పాటు కవిత వరకు నోటీసులు వచ్చాయి. కవితకు నోటీసులు ఇచ్చారు.. ఏం చేస్తారో చూద్దామని చెప్పారు. ప్రజాస్వామ్య, న్యాయబద్ధంగానే ఎదుర్కొందాం అని చెప్పారు. బీజేపీని ఇంటికి పంపడంలో బీఆర్ఎస్ కీలకపాత్ర పోషించాలని కేసీఆర్ పేర్కొన్నారు.