విధాత: ప్రజా వ్యతిరేఖ మోడీని నిలువరించే నాయకుడు, దేశాన్నీ రక్షించగల నాయకుడు కేసీఆర్ మాత్రమేనని సూర్యాపేట శాససభ్యుడు , రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట లోని క్యాంపు కార్యాలయం లో ఆదివారం జగదీష్ రెడ్డి అధ్యక్షతన నియోజక వర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. దేశానికి సీఎం కేసీఆర్, పార్టీకి కార్యకర్తలే శ్రీరామ రక్ష అన్నారు. పార్టీ శ్రేణుల ఆత్మీయ సమ్మేళనాలు నాయకులు, కార్యకర్తల మధ్య ఆత్మీయ అనుబంధాన్ని బలోపేతం […]

విధాత: ప్రజా వ్యతిరేఖ మోడీని నిలువరించే నాయకుడు, దేశాన్నీ రక్షించగల నాయకుడు కేసీఆర్ మాత్రమేనని సూర్యాపేట శాససభ్యుడు , రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట లోని క్యాంపు కార్యాలయం లో ఆదివారం జగదీష్ రెడ్డి అధ్యక్షతన నియోజక వర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.

దేశానికి సీఎం కేసీఆర్, పార్టీకి కార్యకర్తలే శ్రీరామ రక్ష అన్నారు. పార్టీ శ్రేణుల ఆత్మీయ సమ్మేళనాలు నాయకులు, కార్యకర్తల మధ్య ఆత్మీయ అనుబంధాన్ని బలోపేతం చేస్తాయన్నారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు క్షేత్ర స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసి, పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపి మరింత చైతన్య పరిచేందుకు పార్టీ అధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నామని ఈ సందర్బంగా మంత్రి పేర్కొన్నారు.

రోజు రోజుకు శ్రుతి మించుతున్న బీజేపీ దుర్మార్గాలను ఎండ గట్టి ఎక్కడి కక్కడ బీఆర్ఎస్ శ్రేణులు తిప్పి కొట్టాలి అని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని అందుకు కార్యకర్తలే ప్రధాన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.

గత సూర్యాపేట ను నేటి సూర్యాపేట తో పోల్చి చూడండి, ఒకప్పుడు సూర్యాపేట లో సాగు,త్రాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతూ నిత్యం రోడ్ల మీద త్రాగునీటి ట్యాంకర్‌లతో గల గల నడిచిన నాటి రోజులు ఒక్కసారి గుర్తు చేసుకోవాలన్నారు. మూసీ మురికి నీటిని తాగిన సూర్యాపేట పట్టణ వాసులకు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి శుద్ధమైన త్రాగునీరు అందిస్తున్నామని అది నిజమా కాదా ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు.

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కులాలు, మతాల మధ్య విద్వేషాలు రగిల్చి చిచ్చు పెట్టాలని ప్రయత్నాలు చేసేందుకు కొందరు వస్తారని అన్నారు. జాతీయ పార్టీలు వాటికున్న బూజులు దులుపుకుని రోడ్లు ఎక్కుతున్నారని తస్మాత్ జాగ్రత్త అని సూచించారు.

సూర్యాపేట నియోజకవర్గం లో బీఆర్ఎస్ పార్టీ కి 15 వేల కుటుంబాలు, 30 వేల మంది బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు ఉన్నారని వారందరు ఏకమై గొంతు తెరిస్తే ప్రత్యర్ధులు పరారావడం ఖాయం అన్నారు. బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతన ఉత్సహన్ని నింపడానికి మండలానికి ఒకటి చొప్పున, పట్టణం లో రెండు నుండి మూడు ఆత్మీయ సమావేశాలను నిర్వహిస్తునట్లు తెలిపారు.

మండలంలో నిర్వహించే సమ్మేళనాలకు 2500 కుటుంబాలు, 5 వేల మంది చొప్పున , పట్టణం లో 5వేల కుటుంబాలు, 10 వేల మంది చొప్పున బీఆర్ ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు హాజరవుతారన్నారు. బీఆర్ఎస్ నిర్వహించ బోయే ఆత్మీయ సమావేశాలు జాతరలా ఉండాలని, దానికి అనుగుణంగా బీఆరెస్ పార్టీ సభ్యులు తరలి వచ్చ్చి ఆత్మీయ సమ్మేళనాలను విజయవంతం చేయాలని కోరారు. ఏప్రిల్ 20లోపు ఆత్మీయ సమావేశాలను పూర్తి చేసుకోవాలని మంత్రి జగదీష్ రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.

రాజ్యాంగ సంస్థల ను నిర్వీర్యం చేసి, రాష్ట్రాలను లొంగ దీసుకోవడానికి ఈడీ, ఐటీలపేరుతో బీజేపీ చేస్తున్న ఊడత ఉపుడుకి భయపడే వాళ్లు ఇక్కడ ఎవరూ లేరని, అక్కడ ఉన్నది కేసీఅర్ అని అది గుర్తుంచుకుని కేంద్రం ప్రవర్తిస్తే మంచిదని హితవు పలికారు.

30 ఏళ్లుగా రాముడు పేరుతోనే రాజకీయం చేస్తున్న దుర్మార్గులు బీజేపీ నాయకులు అన్న మంత్రి , ఎటువంటి రాజకీయం లేకుండా ప్రపంచం అబ్బురపడెలా యాదాద్రి ని నిర్మించిన నాయకుడు కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు ఉన్న శక్తి సామర్ధ్యాలు ప్రత్యర్థులకు ఏ మాత్రం లేవన్న మంత్రి కార్యకర్తలు ఎక్కడి కక్కడ బిజెపి చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.

Updated On 19 March 2023 4:04 PM GMT
krs

krs

Next Story