విధాత: తెలంగాణ తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన శాంతి కుమారి.. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఎంతో నమ్మకంతో సీఎస్‌గా సీఎం అవకాశం కల్పించారు. కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని ఆమె పేర్కొన్నారు.
రాష్ట్రాభివృద్ధికి శాయశక్తులా పని చేస్తానని స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలు దేశానికే తలమానికం అన్నారు. ప్రాధాన్య కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తానని చెప్పారు.
అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల అమలులో సహచర అధికారులతో సమన్వయంతో, ప్రజాప్రతినిధుల సహకారంతో విజయవంతంగా అమలు చేయడానికి కృషిచేస్తాను అని అన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ శాంతి కుమారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.