Homeతెలంగాణ‌Ravindra Naik | వైన్.. డైన్.. సైన్‌లతో KCR పాలన: వరంగల్ మాజీ ఎంపీ రవీంద్రనాయక్

Ravindra Naik | వైన్.. డైన్.. సైన్‌లతో KCR పాలన: వరంగల్ మాజీ ఎంపీ రవీంద్రనాయక్

Ravindra Naik | KCR

విధాత: రాష్ట్రంలో వైన్.. డైన్.. సైన్ లతో KCR అవినీతి, విధ్వంసకర పరిపాలన చేస్తున్నారని వరంగల్ మాజీ ఎంపీ రవీంద్రనాయక్ విమర్శించారు. గురువారం నల్లగొండలో ఆయన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల పాలనలో అవినీతి విలయతాండవం చేస్తుందని విమర్శించారు.

రాష్ట్రం సిద్ధించిన నాటి నుండి నేటి వరకు రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కాగితాలకే పరిమితమైందన్నారు. వాస్తవానికి 50 శాతం నిధులు కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. కెసిఆర్ ప్రభుత్వం అవినీతిపైన కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.

10 సంవత్సరాల బిఆర్ఎస్ ప్రభుత్వం 26 లక్షల కోట్ల బడ్జెట్ను రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిందని, దానిలో సగం కెసిఆర్ కుటుంబ సభ్యులే దోచుకున్నారని విమర్శించారు. రాష్ట్ర గవర్నర్ కెసిఆర్ అవినీతి పైన ఎప్పటికప్పుడు నివేదికలు పంపించి, KCR అవినీతిపైన కేంద్ర నిఘా సంస్థలకు దర్యాప్తును అప్పజెప్పాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అప్పుల పైన శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాలేశ్వరం ప్రాజెక్టు తో ఒక ఎకరం కూడా అదనంగా నీరు ఇవ్వడంలేదని కేవలం కాలేశ్వరం ప్రాజెక్ట్ కమిషన్ల కోసమే కట్టారని విమర్శించారు . బిస్వల్ కమిటీ సూచించిన విధంగా 1.92 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ప్రకటించినా వాటిని భర్తీ చేసే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు.

నిరుద్యోగ భృతి, మహిళలకు వడ్డీలేని రుణాలను అందించలేదని పేర్కొన్నారు. నియోజకవర్గాలలో దళిత బంధు అబ్ధిదారుల ఎంపికలలో అవకతవకలకు పాల్పడిన ఎమ్మెల్యేల పైన ముఖ్యమంత్రి ఎందుకు చర్యలు తీసుకోలేదని విమర్శించారు.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular