ఆంధ్రాలో మద్దతు కూడగట్టడమే లక్ష్యం విధాత: ఖమ్మం సభ ముగిసింది.. ఎలాగూ తెలంగాణలో తిరుగులేదు.. ఆంధ్రాలో పార్టీని నడిపేందుకు తోట చంద్రశేఖర్ తదితరులు రెడీగా ఉండనే ఉన్నారు. ఒరిస్సాలో కూడా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గోమంగో పార్టీలోకి చేరుతున్నారు. అక్కడా మెల్లగా పార్టీ విస్తరణకు ప్రయత్నాలు మొదలవు తున్నాయ్.. కర్ణాటకలో కూడా ప్రకాష్ రాజ్ సారథ్యంలో పార్టీ నడుస్తుందని అంటున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రం వెలుపల కేసీఆర్ తొలి సభ ఎక్కడ పెడతారు. ఏ ప్రాంత ప్రజలను […]

ఆంధ్రాలో మద్దతు కూడగట్టడమే లక్ష్యం

విధాత: ఖమ్మం సభ ముగిసింది.. ఎలాగూ తెలంగాణలో తిరుగులేదు.. ఆంధ్రాలో పార్టీని నడిపేందుకు తోట చంద్రశేఖర్ తదితరులు రెడీగా ఉండనే ఉన్నారు. ఒరిస్సాలో కూడా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గోమంగో పార్టీలోకి చేరుతున్నారు. అక్కడా మెల్లగా పార్టీ విస్తరణకు ప్రయత్నాలు మొదలవు తున్నాయ్.. కర్ణాటకలో కూడా ప్రకాష్ రాజ్ సారథ్యంలో పార్టీ నడుస్తుందని అంటున్నారు.

అయితే తెలంగాణ రాష్ట్రం వెలుపల కేసీఆర్ తొలి సభ ఎక్కడ పెడతారు. ఏ ప్రాంత ప్రజలను ఆకట్టుకుంటారన్నది తెలియడం లేదుకానీ విశాఖలో సభ పెట్టాలన్నది తమ ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. పొరుగునున్న ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన నగరమైన విశాఖలో భారతీయ రాష్ట్ర సమితి సభ నిర్వహించి పొలికేక పెట్టాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు.

ఖమ్మం సభలో ఇరుగునున్న విజయవాడ ఏరియాకు మెసేజ్ వెళ్ళింది. ఇక విశాఖ సభలో ఉత్తరాంధ్రతో బాటు ఈస్ట్..వెస్ట్ గోదావరి జిల్లాలనూ కవర్ చేయొచ్చని అనుకుంటున్నారు. కేసీఆర్‌కు తొలి నుంచి ఉత్తరాంధ్రా మీద ఆసక్తి ఉంది.

దానికి కారణం బీసీలు ఎక్కువగా ఉండడం వెలమలు కూడా పెద్ద సంఖ్యలో ఉండడంతో బాటు ఈ ప్రాంతం నుంచి హైదరాబాద్‌కు వలసలు కూడా ఎక్కువే. హైదరాబాద్ లో కాయకష్టం చేసేవాళ్ళలో ఉత్తరాంధ్రులే ఎక్కువ. ఇప్పటికే కొందరు నాయకులను తన పార్టీలో చేర్చుకునే ఉద్దేశ్యంతో వారితో కేసీఆర్ చర్చలు జరిపినట్లు చెబుతున్నారు.

ఉత్తరాంధ్రాలో బీఆర్‌ఎస్ పునాదులు గట్టిగా పడాలన్న ఉద్దేశ్యంతో ఆయన బలమైన నాయకులను ఆహ్వానిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటిదాకా ఏపీలో కీలకమైన నాయకులు పార్టీలో చేరుతారని ప్రచారం సాగినా కూడా ఎవరూ చేరలేదు.

అయితే విశాఖలో కేసీయార్ సభను ఏర్పాటు చేస్తే ఆ రోజున కొందరు ఆయన సమక్షంలో పార్టీలో చేరతారని ఆశిస్తున్నారు. జెండా కప్పుకుంటారని అంటున్నారు.

Updated On 19 Jan 2023 11:37 AM GMT
krs

krs

Next Story