KCR విధాత: ఎన్నికలు సమీపిస్తున్న వేళ అటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని సమాయత్తం చేసేందుకు బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవమైన ఏప్రిల్ 27వ తేదీన పార్లమెంటరీ, శాసన సభా పక్ష సంయుక్త సమావేశాన్ని నిర్వహించిన కేసీఆర్… 19 రోజుల వ్యవధిలోనే మరోసారి శాసన సభా పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం రాజకీయ వర్గాలలో ఆసక్తి రేపింది. ఆ మరుసటి రోజే గురువారం మంత్రి వర్గ సమావేశం నిర్వహించనున్నారు. కొత్త […]

KCR

విధాత: ఎన్నికలు సమీపిస్తున్న వేళ అటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని సమాయత్తం చేసేందుకు బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవమైన ఏప్రిల్ 27వ తేదీన పార్లమెంటరీ, శాసన సభా పక్ష సంయుక్త సమావేశాన్ని నిర్వహించిన కేసీఆర్… 19 రోజుల వ్యవధిలోనే మరోసారి శాసన సభా పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం రాజకీయ వర్గాలలో ఆసక్తి రేపింది. ఆ మరుసటి రోజే గురువారం మంత్రి వర్గ సమావేశం నిర్వహించనున్నారు.

కొత్త సచివాలయం ప్రారంభమైన తరువాత నిర్వహిస్తున్న ఈ సమావేశం మొదటిది కావడం విశేషం. అయితే పార్టీ సమావేశం, ఆ వెంటనే మంత్రి వర్గ సమావేశం జరగడం రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సీఎం కేసీఆర్‌కు మింగుడు పడడం లేదని రాజకీయ ప్రత్యర్థులు అంటున్నారు.

అందుకే కాంగ్రెస్ పార్టీ గెలిచినందుకు కనీసం శుభాకాంక్షలు తెలుపలేదంటున్నారు. మరో వైపు కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణపై కూడ పడే అవకాశం ఉండడంతో, ఏవిధంగా కాంగ్రెస్‌కుఅడ్డుకట్ట వేయాలన్నదానిపై ఈ సమావేశంలో క్యాడర్‌కు దిశానిర్దేశం చేయనున్నట్లు చర్చ జరుగుతుంది.

ఈ నెల18న మంత్రి వర్గ సమావేశం

ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారి అధ్యక్షతన.. డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో.. రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనున్నది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఈ నెల17న బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం

భారత రాష్ట్ర సమితి శాసన సభా పక్షం, పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశం బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణభవన్లో జరుగనున్నది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఎంపీలు, ఎమ్మల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర స్థాయి కార్పోరేషన్ చైర్మన్లు కూడా పాల్గొంటారు.

సమావేశంలో నియోజకవర్గాల వారిగా పార్టీ పరిస్థితిపై చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన స్కీమ్ల గురించి ప్రజలకు చెప్పడంతో పాటు, దళిత బంధు, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ, సొంత జాగా ఉన్న వారికి మూడు లక్షల రూపాయలు ఇచ్చే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ప్రభుత్వ పథకాలన్నింటినీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోగా ఎలా లబ్ధిదారులకు అందించాలన్న దానిపై చర్చిస్తారు.

Updated On 17 May 2023 3:57 AM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story