Keerthy Suresh | మ‌హాన‌టి సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులు కొల్ల‌గొట్ట‌డమే కాకుండా నేష‌న‌ల్ అవార్డ్ కూడా ద‌క్కించుకున్న అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్. ప్ర‌స్తుతం ఈ అందాల ముద్దుగుమ్మ వ‌రుస సినిమా అవ‌కాశాలు ద‌క్కించుకుంటూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఇటీవల కీర్తి సురేష్‌కి మంచి హిట్స్ దక్కాయి. ప్ర‌స్తుతం ప‌లు సినిమాల‌తో బిజీగా ఉంది. అయితే కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించి గ‌త కొన్నాళ్లుగా అనేక రూమ‌ర్స్ హ‌ల్‌చ‌ల్ చేస్తూ ఉన్నాయి. వరుడు వ్యాపారవేత్త అని […]

Keerthy Suresh |

మ‌హాన‌టి సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులు కొల్ల‌గొట్ట‌డమే కాకుండా నేష‌న‌ల్ అవార్డ్ కూడా ద‌క్కించుకున్న అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్. ప్ర‌స్తుతం ఈ అందాల ముద్దుగుమ్మ వ‌రుస సినిమా అవ‌కాశాలు ద‌క్కించుకుంటూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఇటీవల కీర్తి సురేష్‌కి మంచి హిట్స్ దక్కాయి. ప్ర‌స్తుతం ప‌లు సినిమాల‌తో బిజీగా ఉంది.

అయితే కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించి గ‌త కొన్నాళ్లుగా అనేక రూమ‌ర్స్ హ‌ల్‌చ‌ల్ చేస్తూ ఉన్నాయి. వరుడు వ్యాపారవేత్త అని ఒక‌సారి, ఆమె స్నేహితుడే అని ఇంకోసారి, ఇండ‌స్ట్రీకి చెందిన వ్య‌క్తి అంటూ ఇలా ప‌లు రూమర్లు నెట్టింట షికార్లు చేశాయి. వాటన్నింటిని ఎప్పటికప్పుడు ఖండిస్తూనే వస్తున్నా కూడా రూమర్స్ మాత్రం వ‌స్తూనే ఉన్నాయి.

గ‌త కొన్నాళ్లుగా ఈ ముద్దుగుమ్మ స్టార్ మూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్ర తో ప్రేమ‌లో ఉంద‌ని, అత‌నిని పెళ్లి చేసుకోనుంద‌ని ప్ర‌చారాలు జ‌రుగుతూనే ఉన్నాయి. వీటిని కీర్తి ప‌లు సంద‌ర్భాల‌లో ఖండించారు కూడా. అయిన‌ప్ప‌టికీ ఈ ముద్దుగుమ్మ పెళ్లి గురించి సోష‌ల్ మీడియాలో ఏదో ఒక వార్త వ‌స్తూనే ఉంది.

ఆమె పెళ్లి గురించి అనేక ప్ర‌చారాలు జ‌రుగుతున్న నేప‌థ్యంలో తాజాగా ఆమె తండ్రి స్పందించడం ఆసక్తికరంగా మారింది. అనిరుద్ తో కీర్తి సురేష్‌ పెళ్లి అజి జ‌గ‌రుతున్న ప్ర‌చారంలో నిజం లేదని చెబుతూ కీర్తి సురేష్ తండ్రి క్లారిటీ ఇచ్చారు. ఇవన్నీ ఎవరో కావాలని పుట్టిస్తున్న పుకార్లు మాత్రమే, ఇందులో ఏ మాత్రం నిజం లేదంటూ కీర్తి తండ్రి కొట్టి పారేశారు.

కీర్తికి పెళ్లి కుదిరితే మీడియాకు ముందుగా మేమే చెబుతామని.. ఇలాంటి సున్నితమైన విషయాలపై రూమర్స్ క్రియేట్ చేయోద్దని కీర్తి సురేష్ తండ్రి సురేష్ కుమార్ అన్నారు. చిన్నవయసులోనే సినీ ప్రపంచంలోకి అడుగు పెట్టిన కీర్తి సురేష్.. 2000 సంవత్సరంలో ‘ఫైలెట్స్’ అనే సినిమాతో బాలనటిగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇక హీరోయిన్‌గా నేను శైల‌జ చిత్రంతో ప‌రిచ‌యం అయింది. ఒక్క తెలుగులోనే కాకుండా త‌మిళం, మ‌ల‌యాళం సినిమాల‌లో కూడా కీర్తి త‌న స‌త్తా చాటుతుంది.

Updated On 18 Sep 2023 3:38 AM GMT
sn

sn

Next Story