విధాత‌: ఎవ‌రైనా ఇంట గెలిచి రచ్చ గెలవాలని అంటారు. కానీ పాపం బీజేపీకి ఈ సామెత అచ్చిరావడం లేదు. దేశంలో దాదాపు పాతిక పైగా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ఢిల్లీ అసెంబ్లీని, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ను మాత్రం ఆమ్ఆద్మీ పార్టీ కి అప్పగించక తప్పడం లేదు. చూస్తుంటే గజ ఈతగాడు గెడ్డలో పడి కొట్టుకుపోవడం అంటే ఇదే.. సప్త సముద్రాలు ఈదినవాడు ఇంటి ముందు కాల్వలో మునిగిపోవడం అంటే ఇదే. ఢిల్లీ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌ను […]

విధాత‌: ఎవ‌రైనా ఇంట గెలిచి రచ్చ గెలవాలని అంటారు. కానీ పాపం బీజేపీకి ఈ సామెత అచ్చిరావడం లేదు. దేశంలో దాదాపు పాతిక పైగా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ఢిల్లీ అసెంబ్లీని, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ను మాత్రం ఆమ్ఆద్మీ పార్టీ కి అప్పగించక తప్పడం లేదు. చూస్తుంటే గజ ఈతగాడు గెడ్డలో పడి కొట్టుకుపోవడం అంటే ఇదే.. సప్త సముద్రాలు ఈదినవాడు ఇంటి ముందు కాల్వలో మునిగిపోవడం అంటే ఇదే.

ఢిల్లీ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌ను 15 ఏళ్లుగా బీజేపీ పాలిస్తోంది. అయితే ఆ అధిపత్యానికి గండి కొడుతూ బీజేపీ కంచుకోట‌ను ఆప్ బ‌ద్ద‌లు కొట్టింది. దేశ రాజ‌ధాని కేంద్రంలో మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డం ద్వారా ఆప్ బీజేపీకి కోలుకోలేని అవమానాన్ని అందించింది.

ఢిల్లీ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌లో మొత్తం 250 వార్డుల‌కు ఈ నెల 4న ఎన్నిక‌లు జ‌రిగాయి. నేడు ఫలితాలు లెక్కించగా ఆప్ 134 స్థానాల‌ను ద‌క్కించుకుని అధికారాన్ని హ‌స్త‌గ‌తం చేసుకుంది. బీజేపీ 104 స్థానాల‌తో స‌రిపెట్టుకుంది. కాంగ్రెస్ 9 వార్డుల‌కే ప‌రిమిత‌మైంది.

గతంలో అంటే 2017లో 270 మున్సిప‌ల్ వార్డుల‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో 181 వార్డులను బీజేపీ కైవ‌సం చేసుకొని అధికారాన్ని దక్కించుకోగా అప్పుడు ఆప్ 48 , కాంగ్రెస్ 30 స్థానాల‌ను గెలుచుకున్నాయి. ఇప్పుడు ఢిల్లీ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌ను ఆప్ సొంతం చేసుకోవ‌డం ద్వారా ప్ర‌జ‌ల్లో త‌న ప‌ట్టును ఆ పార్టీ నిలుపుకున్న‌ట్టైంది.

Updated On 7 Dec 2022 12:56 PM GMT
krs

krs

Next Story