JR NTR, MALINENI GOPICHAND యంగ్ టైగ‌ర్‌తో రెండు చిత్రాలు మిస్ అయ్యాయి మనం తినే ప్రతి బియ్యపు గింజ మీద మన పేరు రాసి ఉంటుందని మన పెద్దలు చెప్తారు. దీన్నే దానే దానే లిఖా హోతా జిస్ కా నామ్ అన్నట్టు ఉంటుంది. గతంలో ఎందరో హీరోలు కొన్ని చిత్రాలను చేయాలనుకుని డ్రాప్ అయ్యారు. అవి వేరే హీరోలను వరించి సూపర్ డూపర్ హిట్స్ గా నిలిచాయి. మరికొన్ని డిజాస్టర్ గారు మిగిలాయి. డిజాస్టర్‌గా […]

JR NTR, MALINENI GOPICHAND

యంగ్ టైగ‌ర్‌తో రెండు చిత్రాలు మిస్ అయ్యాయి

మనం తినే ప్రతి బియ్యపు గింజ మీద మన పేరు రాసి ఉంటుందని మన పెద్దలు చెప్తారు. దీన్నే దానే దానే లిఖా హోతా జిస్ కా నామ్ అన్నట్టు ఉంటుంది. గతంలో ఎందరో హీరోలు కొన్ని చిత్రాలను చేయాలనుకుని డ్రాప్ అయ్యారు. అవి వేరే హీరోలను వరించి సూపర్ డూపర్ హిట్స్ గా నిలిచాయి. మరికొన్ని డిజాస్టర్ గారు మిగిలాయి. డిజాస్టర్‌గా మిగిలిన చిత్రాల విషయంలో మొదటగా సంప్రదించిన హీరోలు పెద్దగా బాధ పడకపోయినా సంతోషపడే వారు.

కానీ తాము కాదన్న చిత్రాలు ఇతరులతో చేసి అవి పెద్ద ఘన విజయం సాధించినప్పుడు మాత్రం కాస్త బాధపడే ఉంటారు. ఇక ఈ ఫీల్డ్ లో ఎవరు ఏ సినిమా చేయాలి అనేది ముందే రాసిపెట్టి ఉంటుంది అని చెప్తుంటారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరికి అది చేరాల్సిన వ్యక్తికి చేరుతుంది.

అందుకు తాజా ప్రత్యక్ష సాక్షమే ఖైదీ నెంబర్ 150 సినిమా. ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఫిలింగా వినాయక దర్శకత్వంలో ఖైదీ నెంబర్ 150గా చేశారు. ఈ చిత్రం కోలీవుడ్‌లో విజయ్ హీరోగా నటించిన కత్తి సినిమాకు రీమేక్. ముందుగా ఈ కత్తి సినిమాను తారక్‌తో చేయాలని దర్శకుడు గోపీచంద్ భావించాడు. కానీ అది చివరికి చిరు చేతిలోకి వెళ్ళింది. ఈ విషయాన్ని స్వయంగా గోపీచంద్ మ‌లినేని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

గోపీచంద్ మలినేని మాట్లాడుతూ తమిళంలో కత్తి సినిమా చూసే తరువాత తెలుగులో ఎన్టీఆర్‌తో రీమేక్ చేయాలనుకున్నాం. ఆ విషయాన్ని డైరెక్టర్ మురుగదాసు దృష్టికి తీసుకెళ్లగా ఆయన కూడా చాలా బాగుంటుందని చెప్పారు. ఆయన ఎన్టీఆర్‌తో మాట్లాడటం కూడా జరిగింది. మేము ఇలా మాట్లాడుకుంటు న్న సమయంలో ఆ కత్తి సినిమా హక్కుల్ని చిరంజీవి కొనేశారు.

నిజానికి హీరో విజయ్ వ‌ల్ల ఈ సినిమా విషయంలో కాస్త కన్ఫ్యూజన్ ఏర్పడింది. మేము రీమేక్ కోసం ప్ర‌య‌త్నిస్తూ ఉంటే విజయ్ దానిని డబ్బింగ్ చేయించి తెలుగులో రిలీజ్ చేయాలని ఆసక్తి చూపించాడు. ఆ విష‌యంలో కాస్త సందిగ్ధం ఏర్పడింది. మేము మళ్ళీ రీకనెక్ట్ అయ్యే లోపు ఆ సినిమా హ‌కుల్ని చిరు కొన్నారని తెలిసింది అని చెప్పుకొచ్చారు.

కొంత కాలం త‌ర్వాత నేను ఎన్టీఆర్‌తో మ‌రో చిత్రం చేయాల‌ని ప్లాన్ చేశాను. దిల్ రాజు నిర్మాణంలో ఒక సినిమా చేయాలనుకుని తారక్‌కి ఒక మాస్ కథలు వినిపించాను. అయితే నీ నుంచి ఇంత మాస్ క‌థ‌ను ఎక్స్పెక్ట్ చేయలేదు. మ‌రీ ఇంత భారీ సినిమాలో చేయలేనని కొంత కామెడీ యాంగిల్ ఏమైనా ఉంటే చెప్పమని ఆయ‌న నాకు చెప్పారు. అలా తనకు రెండు సార్లు ఎన్టీఆర్‌తో సినిమా ఛాన్సులు మిస్ అయ్యాయని గోపీచంద్ మలినేని చెప్పుకొచ్చాడు.

ఇక తమిళంలో మురుగదాసు దర్శకత్వంలోనే వచ్చిన రమణ చిత్రం విషయంలో కూడా ఇలాంటి సంఘటనే ఎదురయింది. మొదట ఈ సినిమా రీమేక్ హక్కులను హీరో రాజశేఖర్ తీసుకోవాలనుకున్నాడు. కానీ పలు కారణాల వల్ల అది చిరంజీవికి వెళ్ళింది. అది ఠాగూర్‌గా రీమేకై ఘన విజయం సాధించింది. దాంతోనే చిరంజీవి- రాజశేఖర్‌ల మధ్య వైరం పెరిగిందని సినీ జనాలు చెప్పుకుంటూ ఉంటారు. అయితే కత్తి విషయంలో మాత్రం చిరు ఎన్టీఆర్‌ల మధ్య ఎలాంటి విభేదాలు పొడ‌ చూప‌క‌పోవ‌డం విశేషం.

Updated On 25 Jan 2023 4:04 AM GMT
krs

krs

Next Story