నాలుగు సెగ్మెంట్‌లపై కేంద్రీకరణ మంత్రులిద్దరికీ పూర్తి బాధ్యతలు ఎంపీ కవిత, ఎమ్మెల్యేలకు లక్ష్యం ఖమ్మం జిల్లాలో వరంగల్ నేతలు మధిర, పాలేరు, సత్తుపల్లి బాధ్యతలు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావ సందర్భంగా ఖమ్మం కేంద్రంలో బుధవారం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలో ఓరుగల్లు భాగస్వామ్యం కీలకం కానున్నది. సభ నిర్వహణతో పాటు, విజయవంతంలో నాయకులు ముఖ్య పాత్ర నిర్వహిస్తున్నారు. ఖమ్మం సభకు మానుకోట ప్రాంతం నుంచి పెద్ద సంఖ్యలో […]

- నాలుగు సెగ్మెంట్‌లపై కేంద్రీకరణ
- మంత్రులిద్దరికీ పూర్తి బాధ్యతలు
- ఎంపీ కవిత, ఎమ్మెల్యేలకు లక్ష్యం
- ఖమ్మం జిల్లాలో వరంగల్ నేతలు
- మధిర, పాలేరు, సత్తుపల్లి బాధ్యతలు
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావ సందర్భంగా ఖమ్మం కేంద్రంలో బుధవారం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలో ఓరుగల్లు భాగస్వామ్యం కీలకం కానున్నది. సభ నిర్వహణతో పాటు, విజయవంతంలో నాయకులు ముఖ్య పాత్ర నిర్వహిస్తున్నారు.
ఖమ్మం సభకు మానుకోట ప్రాంతం నుంచి పెద్ద సంఖ్యలో జనాన్ని సమీకరించే లక్ష్యంతో కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నారు. గత వారం రోజుల నుంచి మానుకోట జిల్లా పరిధిలోని ఇల్లెందు, మహబూబాబాద్, డోర్నకల్, పాలకుర్తి నియోజకవర్గాల్లోని మండలాల వారీగా బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు.
గత రెండు రోజులుగా ముఖ్య నాయకులు సమావేశమై వేలాదిమంది జనాన్ని సభకు ఏ విధంగా సమీకరించాలనే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. ఈ సమావేశాలను జిల్లా మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రధాన భూమిక నిర్వహిస్తున్నారు.
మానుకోట బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు హరిప్రియ, బానోత్ శంకర్ నాయక్, డిఎస్ రెడ్యానాయక్, పాలకుర్తి ఎమ్మెల్యేగా ఎర్రబెల్లి తమ వంతు భాగస్వామ్యం అవుతున్నారు. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులతో పాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శి నూకల నరేష్ రెడ్డి, ఇతర ముఖ్య నాయకులందరినీ జన సమీకరణలో భాగస్వామ్యం చేస్తున్నారు.
ఖమ్మం జిల్లా కేంద్రానికి మానుకోట జిల్లా సమీపంలో ఉన్నందున జన సమీకరణ సులువవుతుందని దృష్టితో ఈ ప్రాంతంపై కేంద్రీకరించి పనిచేస్తున్నారు. మానుకోట జిల్లా నాయకులంతా జన సమీకరణలో నిమగ్నమై ఉన్నారు.
ఖమ్మంలో వరంగల్ ఎమ్మెల్యేల ప్రచారం
ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎమ్మెల్యేలు, జెడ్పి చైర్మన్లు మరికొంత మంది బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గత పది రోజుల నుంచి ఖమ్మం జిల్లాలోని మధిర, సత్తుపల్లి, పాలేరు తదితర నియోజక వర్గాలలో సమావేశాలు నిర్వహిస్తూ సభ విజయవంతంలో భాగస్వామ్యం అవుతున్నారు.
నర్సంపేట, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, ఆరూరి రమేష్, జనగామ, ములుగు జడ్పీ చైర్మన్లు సంపత్ రెడ్డి, కుసుమ జగదీష్ వివిధ మండలాల కార్యకర్తల సమావేశంలో పాల్గొంటున్నారు.
మొత్తంగా బీఆర్ఎస్ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ సభ విజయవంతంలో ఓరుగల్లు గులాబీ శ్రేణులు, నాయకులు తమ వంతు పాత్ర నిర్వహించడం గమనార్హం.
