Khammam విధాత‌, హైద‌రాబాద్‌: బీఆరెస్ సీనియ‌ర్ నేత మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు బీఆరెస్ పార్టీకి బైబై చెప్పారు. ఏఐసీసీ అధ్య‌క్షుడు మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే మరియు, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స‌మ‌క్షంలో శ‌నివారం హైద‌రాబాద్‌లో కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ కండువా క‌ప్పి తుమ్మ‌ల‌ను పార్టీలోకి ఆహ్వానించారు ఖ‌ర్గే. ఈ కార్య‌క్ర‌మంలో టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి, త‌దిత‌ర ముఖ్య‌నేత‌లు పాల్గొన్నారు. Former minister and BRS leader Thummala Nageswara Rao garu joined @INCIndia in the […]

Khammam

విధాత‌, హైద‌రాబాద్‌: బీఆరెస్ సీనియ‌ర్ నేత మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు బీఆరెస్ పార్టీకి బైబై చెప్పారు. ఏఐసీసీ అధ్య‌క్షుడు మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే మరియు, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స‌మ‌క్షంలో శ‌నివారం హైద‌రాబాద్‌లో కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ కండువా క‌ప్పి తుమ్మ‌ల‌ను పార్టీలోకి ఆహ్వానించారు ఖ‌ర్గే. ఈ కార్య‌క్ర‌మంలో టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి, త‌దిత‌ర ముఖ్య‌నేత‌లు పాల్గొన్నారు.

తుమ్మ‌ల రాజ‌కీయ ప్ర‌స్థానం

తుమ్మ‌ల మొద‌ట‌ 1982 లో టీడీపీ నుంచి రాజ‌కీయ ప్ర‌వేశం చేశారు. అనంత‌రం 1983లో ఎమ్మెల్యేగా తొలి సారి పోటీ చేసి ఓడిపోయారు. మ‌ళ్లీ ఏడాదిన్న‌ర‌కు జ‌రిగిన 1985 మ‌ద్యంత‌ర ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌గా ఆయ‌న‌ను ఎన్టీఆర్ మంత్రి వ‌ర్గంలోకి తీసుకున్నారు. 1985,1994,1999,2009ఎన్నిక‌ల్లొ టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

త‌రువాత 2014 ఆగ‌ష్టు 30న టీడీపీకి రాజీనామా చేసి బీఆరెస్‌లో చేరారు. 2015లో బీఆరెస్ నుంచి మండ‌లికి ఎన్నిక‌య్యారు. ఆ త‌రువాత 2016 పాలేరు ఉప ఎన్నిక‌ల్లో బీఆరెస్ నుంచి గెలిచారు. కాగా 2004, 2014 లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓట‌మిపాల‌య్యారు. 2018లో జ‌రిగిన‌ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో బీఆరెస్ నుంచి పోటీ చేసి ఓట‌మి చెందారు. అయితే ఎన్టీఆర్‌, చంద్ర‌బాబు, కేసీఆర్ మంత్రి వ‌ర్గాల్లో తుమ్మ‌ల మంత్రిగా పనిచేశారు.

Updated On 16 Sep 2023 11:35 AM GMT
krs

krs

Next Story