Kim Jong Un త‌మ బంధాన్ని చాటి చెప్పాల‌ని ప్ర‌య‌త్నించిన పుతిన్‌, కిమ్‌ విధాత‌: ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్, ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్ జోంగ్ ఉన్‌ (Kim Jong Un) ల భేటీపై ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎంతో ఆస‌క్తి నెల‌కొన్న విష‌యం తెలిసిందే. కిమ్ ప్ర‌యాణించే ట్రైన్ ద‌గ్గ‌రి నుంచి అత‌డి భ‌ద్ర‌తా ఏర్ప‌ట్ల‌ను అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు. తాజాగా ఈ భేటీలో కిమ్‌కు కేటాయించిన కుర్చీని కూడా అత‌డి వ్య‌క్తిగత సిబ్బంది ఎంతో క్షుణ్ణంగా ప‌రిశీలించిన‌ట్లు తెలుస్తోంది. […]

Kim Jong Un

  • త‌మ బంధాన్ని చాటి చెప్పాల‌ని ప్ర‌య‌త్నించిన పుతిన్‌, కిమ్‌

విధాత‌: ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్, ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్ జోంగ్ ఉన్‌ (Kim Jong Un) ల భేటీపై ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎంతో ఆస‌క్తి నెల‌కొన్న విష‌యం తెలిసిందే. కిమ్ ప్ర‌యాణించే ట్రైన్ ద‌గ్గ‌రి నుంచి అత‌డి భ‌ద్ర‌తా ఏర్ప‌ట్ల‌ను అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు. తాజాగా ఈ భేటీలో కిమ్‌కు కేటాయించిన కుర్చీని కూడా అత‌డి వ్య‌క్తిగత సిబ్బంది ఎంతో క్షుణ్ణంగా ప‌రిశీలించిన‌ట్లు తెలుస్తోంది.

ఇందుకు సంబంధించిన వీడియోలు సైతం ఎక్స్‌లో వైర‌ల్ అవుతున్నాయి. ముందుగా అత‌డి సిబ్బంది ఒక‌రు కుర్చీని చేతుల‌తో ప‌ట్టుకుని ప‌రీక్షించారు. అనంత‌రం ఒక ప‌రిక‌రంతో రేడియేష‌న్ చెక్ చేసిన‌ట్లు తెలుస్తోంది. కొన్ని క‌థ‌నాల ప్ర‌కారం.. ఆ కుర్చీ కిమ్ బ‌రువును త‌ట్టుకుందా లేదా అని కూడా సిబ్బంది ప‌రీక్షించిన‌ట్లు తెలుస్తోంది.

140 కేజీల బ‌రువుతో ఊబ‌కాయంతో బాధ‌ప‌డుతున్న కిమ్‌కు సాధార‌ణ కుర్చీలు స‌రిపోక‌పోవ‌డ‌మే దీనికి కార‌ణం. అన్ని జాగ్ర‌త్త‌లు పూర్తి అయిన త‌ర్వాత ఇరు నేతలు వ‌చ్చి ద్వైపాక్షిక చ‌ర్చ‌ల్లో పాల్గొన్నారు. ఈ ద్వైపాక్షిక చ‌ర్చ‌కు ముందు వీరిద్ద‌రూ క‌లిసి ద‌గ్గ‌ర్లో ఉన్న స్పేస్ లాంచింగ్ స్టేష‌న్ను సంద‌ర్శించారు. పుతిన్ అధికారిక గెస్ట్‌హౌస్‌లో న‌డ‌క, ప్రైవేట్ కార్లో చ‌క్క‌ర్లు కొట్టి త‌మ దేశాల దృఢ బంధాన్ని ప్ర‌పంచానికి చూపించే ప్ర‌య‌త్నం చేశారు.

ఈ భేటీతో అప్ర‌మ‌త్త‌మైన ద‌క్షిణా కొరియా, అమెరికా దేశాలు ర‌క్ష‌ణ రంగంలో కీల‌క ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. సుమారు 25 అత్యాధునిక ఎఫ్ 35 జెట్‌ల‌ను ద‌క్షిణ కొరియాకు విక్ర‌యించ‌డానికి అమెరికా దాదాపు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది.

ఈ ఒప్పందం విలువ 5 బిలియ‌న్ డాలర్ల‌ని అంచ‌నా. ర‌ష్యా క‌నుక కిమ్ అడిగిన‌ట్లు క్షిప‌ణి, న్యూక్లియ‌ర్‌, శాటిలైట్ ప్ర‌యోగాల సాంకేతిక‌త‌ను ఉత్త‌రకొరియా (North Korea) కు అందిస్తే.. త‌మ దేశానికి ముప్పు త‌ప్ప‌ద‌ని ద‌క్షిణ కొరియా ఆందోళ‌న చెందుతోంది.

Updated On 15 Sep 2023 6:09 AM GMT
somu

somu

Next Story