Friday, December 9, 2022
More
    Homelatestఫ్రిజ్‌లోకి దూరిన నాగుపాము.. వీడియో చూస్తే వ‌ణికిపోవాల్సిందే..

    ఫ్రిజ్‌లోకి దూరిన నాగుపాము.. వీడియో చూస్తే వ‌ణికిపోవాల్సిందే..

    King Cobra | ఇటీవ‌లి కాలంలో నాగుపాములు ఎక్క‌డంటే అక్క‌డ దూరిపోతున్నాయి. బైక్‌ల్లో దూరి వాహ‌న‌దారుల‌కు ఇబ్బందులు క‌లిగించిన ఘ‌ట‌న‌లు చూశాం. ఓ యువ‌కుడి దుప్పుట్లోకి దూరిన నాగుపాము.. రాత్రంతా అత‌నితో పాటు నిద్రించిన ఘ‌ట‌న చూశాం. తాజాగా ఓ నాగుపాము ఇంట్లోని ఫ్రిజ్ కంప్రెష‌ర్‌లోకి దూరింది. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని తుమ‌కూరులో వెలుగు చూసింది.

    లేత బంగారు వ‌ర్ణంలో ఉన్న ఓ ఆరు అడుగుల నాగుపాము.. ఓ ఇంట్లోని ఫ్రిజ్ కంప్రెష‌ర్‌లోకి దూరింది. బుస‌లు కొడుతున్న నాగుపామును కుటుంబ స‌భ్యులు గ‌మ‌నించారు. దీంతో తీవ్ర భయాందోళ‌న‌కు గురైన కుటుంబ స‌భ్యులు అట‌వీ శాఖ అధికారుల‌కు స‌మాచారం అందించారు. అధికారులు పాములు ప‌ట్టే వ్య‌క్తిని ఆ ఇంటి వ‌ద్ద‌కు తీసుకొచ్చారు.

    బావిలో ప‌డ్డ ఏనుగు.. జేసీబీతో కాపాడిన అట‌వీశాఖ అధికారులు

    ఇక త‌న‌కున్న నైపుణ్యంతో కంప్రెష‌ర్‌లో దూరిన నాగుపామును స్నేక్ క్యాచ‌ర్ ప‌ట్టేశాడు. ఆ స‌మ‌యంలో నాగుపాము ప‌డ‌గ‌విప్పుతూ బుసలు కొట్టింది. ఈ దృశ్యాన్ని చూసి కుటుంబ స‌భ్యులు ఆందోళ‌న‌కు గుర‌య్యారు. స్నేక్ క్యాచ‌ర్ ఆ పామును ఓ డ‌బ్బాలో వేసి, అనంత‌రం అడ‌విలో వ‌దిలిపెట్టాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.

    యాక్టివాలోకి దూరిన నాగుపాము.. ఈ వీడియో చూడాలంటే ధైర్యం ఉండాల్సిందే..

    ముంగీస – నాగుపాము మ‌ధ్య భీక‌ర యుద్ధం.. వీడియో వైర‌ల్

    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular

    You cannot copy content of this page