విధాత, శాస్త్రీయ సంగీతంలో ఉండే మాధుర్యం, సంగీతం అంటే మరింత ఆసక్తిని కలిగించిన గొప్పతనం త్యాగరాజ దే అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేZలోని త్రివేణి ఫంక్షన్ హాల్లో సుధా బ్యాంక్ ఆధ్వర్యంలో జరుగుతున్న త్యాగరాజ ద్విదశాబ్ది ఆరాధనోత్సవాలలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుతమున్న కచేరీ పద్ధతికి ప్రాణం పోసిన వాళ్ళల్లో ఆద్యుడని అన్నారు. సరళమైన భాషలో వినసొంపైన శాస్తీయ సంగీతాన్ని త్యాగరాజు అజరామరం చేశాడన్నారు. శాస్త్రీయ […]

విధాత, శాస్త్రీయ సంగీతంలో ఉండే మాధుర్యం, సంగీతం అంటే మరింత ఆసక్తిని కలిగించిన గొప్పతనం త్యాగరాజ దే అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేZలోని త్రివేణి ఫంక్షన్ హాల్లో సుధా బ్యాంక్ ఆధ్వర్యంలో జరుగుతున్న త్యాగరాజ ద్విదశాబ్ది ఆరాధనోత్సవాలలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

ప్రస్తుతమున్న కచేరీ పద్ధతికి ప్రాణం పోసిన వాళ్ళల్లో ఆద్యుడని అన్నారు. సరళమైన భాషలో వినసొంపైన శాస్తీయ సంగీతాన్ని త్యాగరాజు అజరామరం చేశాడన్నారు. శాస్త్రీయ సంగీత రారాజు త్యాగరాజు అన్న మంత్రి నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన గొప్ప వాగ్గేయకారుడన్నారు.

కర్ణాటక సంగీతానికీ, త్యాగరాజుకీ విడదీయరాని బంధం ఉందన్న మంత్రి ప్రతీ ఏటా సుధా బ్యాంక్ అధ్వర్యంలో త్యాగరాజ ఆరాధోత్సవాలు నిర్వహించడం శుభ పరిణామమని అన్నారు. ఈ సందర్బంగా పలువురు విద్వాంసులను మంత్రి సన్మానించారు.

Updated On 12 Jan 2023 4:52 PM GMT
krs

krs

Next Story