Bigg Boss7 | విధాత: బిగ్ బాస్ సీజ‌న్ 7 కార్య‌క్ర‌మం ఎట్ట‌కేల‌కి వారం రోజులు పూర్తి చేసుకుంది. 14 మంది కంటెస్టెంట్స్‌తో మొద‌లైన ఈ షో నుండి ఒక కంటెస్టెంట్ బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ఎప్ప‌టి మాదిరిగానే అంద‌రు ఊహించిన కంటెస్టెంట్ బ‌య‌ట‌కు రావ‌డం విశేషం. తెలుగు బిగ్ బాస్ ఇత‌ర భాష‌కి సంబంధించిన బిగ్ బాస్ గా మారుతుంద‌ని అనుకున్నారో ఏమో కానీ తెలుగు భాష మాట్లాడలేని కిరణ్ రాథోడ్‌ను బయటకు పంపించేసింది. ఆదివారం ఎపిసోడ్ […]

Bigg Boss7 |

విధాత: బిగ్ బాస్ సీజ‌న్ 7 కార్య‌క్ర‌మం ఎట్ట‌కేల‌కి వారం రోజులు పూర్తి చేసుకుంది. 14 మంది కంటెస్టెంట్స్‌తో మొద‌లైన ఈ షో నుండి ఒక కంటెస్టెంట్ బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ఎప్ప‌టి మాదిరిగానే అంద‌రు ఊహించిన కంటెస్టెంట్ బ‌య‌ట‌కు రావ‌డం విశేషం. తెలుగు బిగ్ బాస్ ఇత‌ర భాష‌కి సంబంధించిన బిగ్ బాస్ గా మారుతుంద‌ని అనుకున్నారో ఏమో కానీ తెలుగు భాష మాట్లాడలేని కిరణ్ రాథోడ్‌ను బయటకు పంపించేసింది.

ఆదివారం ఎపిసోడ్ లో నాగార్జున స్టైలిష్ ఎంట్రీ ఇచ్చారు. సండే ఫ‌న్ డే అంటూ ప్రేక్షకుల‌కి మంచి వినోదం పంచే ప్ర‌య‌త్నం చేసిన నాగార్జున ముందుగా బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్‌లో పవర్ అస్త్రాన్ని సాధించి మొదటి కంటెస్టెంట్‌గా నిలిచిన సందీప్‌కు వీఐపీ రూం యాక్సెస్ ఇచ్చాడు.

అప్పుడు సందీప్ ఆ అస్త్రాన్ని త‌న కొడుక్కి అంకితం చేస్తాన‌ని చెప్ప‌డంతో నాగ్ చిన్న ఝ‌ల‌క్ ఇచ్చాడు. అలా డెడికేట్ చేస్తే ఆ అస్త్రానికి ఉన్న ప‌వ‌ర్స్ అన్ని కూడా పోతాయ‌ని భ‌య‌ పెట్టించాడు నాగ్. అయితే ముందు భ‌య‌ప‌డిన సందీప్ ప‌వ‌ర్స్ అన్ని పోయిన‌ కూడా దాన్ని తన కొడుక్కి అంకితం ఇస్తానని అంటాడు. అప్పుడు నాగ్ ఊరికే అలా చెప్పానని కూల్ చేసేస్తాడు.

అనంత‌రం ఇంట్లోని సభ్యులతో ఆట ఆడించాడు. మగపిల్లలు, ఆడపిల్లలు అంటూ రెండు గ్రూపులుగా డివైడ్ చేసి వారితో ఆట‌లాడించాడు. ఇందులో ఆడ‌పిల్ల‌ల టీం చాలా ఉత్సాహంగా ఆట‌లాడి గెలిచింది. అనంత‌రం ఇంట్లో మరిచిపోయే ఘటన, గుర్తు పెట్టుకునే మూమెంట్ గురించి చెప్పమని నాగ్ హౌజ్‌మేట్స్ కి ఓ టాస్క్ ఇవ్వ‌గా, ఒక్కొక్క‌రు కూడా త‌మ‌కు తోచిన‌ట్టు తెలియ‌జేశారు.

ఇక నామినేష‌న్‌లో ఉన్న ఎనిమిది మందిలో ముందుగా శోభాశ్రీ, రతికా సేఫ్ అయిన‌ట్టు బిగ్ బాస్ ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాత మిగిలిన ఆరుగురిని నామేషన్ కు పిలిచారు. అందరికీ పౌచ్ లు అందించి స్కోర్ బోర్డులు ఇచ్చారు. ఇందులో దామిని (81), గౌతమ్ కృష (88), యావర్ (76), షకీలా (85), కిరణ్ (64), పల్లవి ప్రశాంత్ (93) స్కోర్ చేయ‌గా, వీరిలో అత్యధిక స్కోర్ చేసిన ఇద్దరిని సేఫ్ గా ప్రకటించారు.

దీంతో పల్లవి ప్రశాంత్, గౌతమ్ కృష్ణ సేఫ్ అయ్యారు. మిగిలిన నలుగురిలో యావర్, కిరణ్ లాస్ట్ లో ఉండ‌గా, కిరణ్ ఎలిమినేట్ అయిన‌ట్టు ప్ర‌క‌టించారు. దీంతో బిగ్ బాస్ 7 నుంచి ఎలిమినేట్ అయిన‌ మొట్ట మొదటి కంటెస్టెంట్ గా కిర‌ణ్ నిలిచింది. ఇక బ‌య‌ట‌కు వ‌చ్చిన కిర‌ణ్‌ని ఇంట్లో సీదా కంటెస్టెంట్లు ఎవరు? ఉల్టా కంటెస్టెంట్లు ఎవరు? అంటూ నాగ్ అడిగాడు. దానికి కిర‌ణ్‌.. యావర్ చాలా మంచివాడు అంటూ సీదా కంటెస్టెంట్ అని చెప్పింది. ఆ మాటలకు యావర్ ఒక రకమైన ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చాడు.

ఇక షకిలా అందరికంటే చాలా మంచిదని, షకిలా తరువాత ఎక్కువగా శివాజీతో కనెక్ట్ అయ్యానని, చాలా మంచివాడని, సీదా ఆట ఆడతాడని పేర్కొంది. ప్రశాంత్ ఫస్ట్ నుంచి ఓవర్ కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నాడని ప‌రువు తీసింది. శోభా శెట్టి కూడా ఉల్టా కంటెస్టెంట్‌లానే అనిపిస్తుందంటూ కిర‌ణ్ చెప్పి షాకిచ్చింది.

Updated On 11 Sep 2023 6:14 AM GMT
sn

sn

Next Story