బండికి బదులు ఇవ్వాల్సిన అవ‌స‌రం లేదు.. విధాత, వరంగల్: కేంద్ర నిధులను తెలంగాణ ప్రభుత్వం దారి మళ్లిస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పడం అవ‌గాహ‌న రాహిత్యంగా ఉంద‌ని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రంగా మండిపడ్డారు. కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే ముందు వివరాలు తెలుసుకుని, అవగాహనతో మాట్లాడితే బాగుంటుందని సూచించారు. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కి అవగాహన […]

  • బండికి బదులు ఇవ్వాల్సిన అవ‌స‌రం లేదు..

విధాత, వరంగల్: కేంద్ర నిధులను తెలంగాణ ప్రభుత్వం దారి మళ్లిస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పడం అవ‌గాహ‌న రాహిత్యంగా ఉంద‌ని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రంగా మండిపడ్డారు.

కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే ముందు వివరాలు తెలుసుకుని, అవగాహనతో మాట్లాడితే బాగుంటుందని సూచించారు. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కి అవగాహన లేదని ముక్కుకు, మూతికి తేడా తెలియదని ఎద్దేవా చేశారు. స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.

జనగామ జిల్లా కంటి వెలుగు రెండో దశ సన్నద్ధ కార్యక్రమం పై గురువారం సమీక్ష నిర్వహించిన తర్వాత మంత్రి ఎర్రబెల్లి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. అవార్డులను ఇస్తున్న కేంద్రం డబ్బులు ఇస్తే బాగుంటుంది అన్నారు. రాష్ట్రం పైన కక్ష సాధింపు చేయవద్దని విజ్ఞప్తి చేశారు.

కేంద్ర అధికారులను హైదరాబాద్ కు తీసుకొస్తే రాష్ట్ర శాఖ అధికారులను తీసుకొచ్చి మీరిచ్చిన డబ్బులు మళ్ళించామా? లేదా ? సమాధానం చెప్తాం అన్నారు. కల్లాలకు రూ. 150 కోట్లు ఖర్చు చేస్తే రూ. 1100 కోట్లు ఎందుకు ఆపారని ప్రశ్నించారు. గ్రామ పంచాయతీలకు ఆరు నెలలుగా కేంద్ర నిధులు రాక ఇబ్బందులు పడుతున్నాం అన్నారు.

బండిని గుండు అంటాడని, గుండును బండి అంటాడని ఆయనకేమీ తెలవదు అన్నారు. మంత్రి వెంట‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎడవల్లి కృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్ శివలింగయ్య తదితరులు ఉన్నారు.

Updated On 5 Jan 2023 3:11 PM GMT
krs

krs

Next Story