-ఏటీఎం ఫ్రాంఛైజ్ వ్యాపారం తెలుసా.. విధాత‌: ఏటీఎం ఫ్రాంఛైజ్ (ATM FRANCHISE) వ్యాపారం గురించి మీకు తెలుసా.. ఒక్క‌సారి రూ.5 ల‌క్ష‌ల పెట్టుబ‌డి పెడితే నెల‌నెలా రూ.70,000 ఆదాయం అందుకోవ‌చ్చు. దేశ‌వ్యాప్తంగా ఏటీఎంల‌ను ఏర్పాటు చేయ‌డానికి మెజారిటీ బ్యాంకులు టాటా ఇండీక్యాష్‌ (TATA INDICASH), ముత్తూట్ (MUTHOOT) ఏటీఎం, ఇండియా వ‌న్ (INDIA ONE) ఏటీఎంల‌తో కాంట్రాక్టులు కుదుర్చుకుంటున్నాయి. కాబ‌ట్టి ఏదైనా బ్యాంక్ నుంచి ఏటీఎం ఫ్రాంఛైజ్‌ను మీరు పొందాల‌నుకుంటే ఈ కంపెనీల అధికారిక వెబ్‌సైట్ల ద్వారా […]

-ఏటీఎం ఫ్రాంఛైజ్ వ్యాపారం తెలుసా..

విధాత‌: ఏటీఎం ఫ్రాంఛైజ్ (ATM FRANCHISE) వ్యాపారం గురించి మీకు తెలుసా.. ఒక్క‌సారి రూ.5 ల‌క్ష‌ల పెట్టుబ‌డి పెడితే నెల‌నెలా రూ.70,000 ఆదాయం అందుకోవ‌చ్చు. దేశ‌వ్యాప్తంగా ఏటీఎంల‌ను ఏర్పాటు చేయ‌డానికి మెజారిటీ బ్యాంకులు టాటా ఇండీక్యాష్‌ (TATA INDICASH), ముత్తూట్ (MUTHOOT) ఏటీఎం, ఇండియా వ‌న్ (INDIA ONE) ఏటీఎంల‌తో కాంట్రాక్టులు కుదుర్చుకుంటున్నాయి.

కాబ‌ట్టి ఏదైనా బ్యాంక్ నుంచి ఏటీఎం ఫ్రాంఛైజ్‌ను మీరు పొందాల‌నుకుంటే ఈ కంపెనీల అధికారిక వెబ్‌సైట్ల ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. వెబ్‌సైట్ అస‌లైన‌దేనా? అన్న‌ది చెక్ చేసుకున్న త‌ర్వాతే ముందుకెళ్లండి. లేక‌పోతే మోస‌పోయే ప్రమాదం ఉన్న‌ది.

ఏయే స‌దుపాయాలు క‌ల్పించాలి

ఏటీఎం కోసం క‌నీసం 50-80 చ‌ద‌ర‌పు అడుగుల స్థ‌లంతో ఓ గ‌ది ఉండాలి. శాశ్వ‌త భ‌వ‌నం, అదికూడా కాంక్రిట్‌తో నిర్మించిన దాంట్లోనే కావాలి. ఇప్ప‌టికే ఉన్న ఏటీఎంల‌కు 100 మీట‌ర్ల దూరమైనా ఇది ఉండాలి. అంద‌రికీ క‌నిపించేలా, జ‌నం బాగా ఉండే ర‌ద్దీ ప్రాంతాల్లో ఉంటే మంచిది. అలాగే నిరంత‌ర విద్యుత్తు సదుపాయం అవ‌స‌రం. ఇందుకు క‌నీసం 1 కిలోవాట్ విద్యుత్తు క‌నెక్ష‌న్ త‌ప్ప‌నిస‌రి. అలాగే చుట్టుప‌క్క‌ల వారి నుంచి ఈ ఏటిఎం వ‌ల్ల త‌మ‌కు ఎటువంటి ఇబ్బంది లేద‌న్న ధ్రువీక‌ర‌ణ ఉండాలి.

ఏయే డాక్యుమెంట్లు అవ‌స‌రం

-ఐడీ ప్రూఫ్‌గా ఆధార్‌, పాన్‌, ఓట‌ర్ ఐడీ కార్డులు
-అడ్ర‌స్ ప్రూఫ్‌గా రేష‌న్ కార్డు లేదా ఎల‌క్ట్రిసిటీ బిల్లులు
-బ్యాంక్ అకౌంట్, పాస్ బుక్‌
-పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ ఫోన్ నెంబ‌ర్ వివ‌రాలు
-జీఎస్టీ నెంబ‌ర్‌
-కంపెనీ కోరిన ఇత‌ర ఆర్థిక వివ‌రాలు, డాక్యుమెంట్లు, ఫారాలు

ఆదాయం ఇలా..

ఏటీఎం ఫ్రాంఛైజ్‌ కోసం అనుమ‌తి వ‌స్తే.. సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ.2 ల‌క్ష‌లు పెట్టాల్సి ఉంటుంది. అలాగే నిర్వ‌హ‌ణ పెట్టుబ‌డి కోసం మ‌రో రూ.3 ల‌క్ష‌లు అవ‌స‌రం. మొత్తం రూ.5 ల‌క్ష‌లు ఉండాలి. ఆయా కంపెనీల‌నుబ‌ట్టి ఇది మారుతుంది. ఇక ఏటీఎం ఏర్పాటైన త‌ర్వాత అందులో జ‌రిగే ప్ర‌తీ న‌గ‌దు లావాదేవీపై రూ.8, బ్యాలెన్స్ చెకింగ్ త‌దిత‌ర న‌గ‌దేత‌ర లావాదేవీపై రూ.2 చొప్పున ఆదాయం పొందుతారు. ఇలా రోజుకు ఎన్ని లావాదేవీలు జ‌రిగితే అంత ఆదాయం.

Updated On 28 Feb 2023 9:49 AM GMT
Somu

Somu

Next Story