విధాత: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం హరిహర వీరమల్లు. ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందో తెలియదు గానీ.. పవన్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం కావడంతో దీనికోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. దాంతో ఈ సినిమాపై రోజు రోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. పవన్‌తో ‘ఖుషి’, ‘బంగారం’ చిత్రాల తర్వాత బడా నిర్మాత ఏ ఎమ్ రత్నం నిర్మిస్తున్న చిత్రమిది. ఆయన ఈ చిత్రం కోసం భారీ బడ్జెట్‌ని కేటాయిస్తున్నారు. […]

విధాత: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం హరిహర వీరమల్లు. ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందో తెలియదు గానీ.. పవన్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం కావడంతో దీనికోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. దాంతో ఈ సినిమాపై రోజు రోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి.

పవన్‌తో ‘ఖుషి’, ‘బంగారం’ చిత్రాల తర్వాత బడా నిర్మాత ఏ ఎమ్ రత్నం నిర్మిస్తున్న చిత్రమిది. ఆయన ఈ చిత్రం కోసం భారీ బడ్జెట్‌ని కేటాయిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు ఇప్పటికే సగానికి పైగా పూర్తయ్యాయి. తాజాగా మరో షెడ్యూల్ మొదలుపెట్టారు. బాలీవుడ్ నటుడు బాబీడియోల్ కూడా ఈ షెడ్యూల్లో వర్క్ చేస్తున్నాడట.

హరిహర వీరమల్లు సినిమా ఔరంగజేబు చారిత్రక నేపథ్యంలో తెరపైకి రాబోతోంది. ఇది పీరియాడికల్ ఫిక్షన్ మూవీ అని తెలుస్తోంది. కాన్సెప్ట్ ఏమిటి అనేది ఎవరికీ క్లారిటీ లేదు. దాన్ని చాలా రహస్యంగా మెయింటైన్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో మూడు విధాలైన షేడ్స్‌లో కనిపిస్తాడట. మన దేశంలో ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్న కోహినూరు వజ్రం గురించి ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది. ఈ వజ్రం చుట్టూనే ఈ సినిమా కథ, హీరో చేసే పోరాటాలు ఆధారపడి ఉంటాయని స‌మాచారం.

అందుకే ఆ వజ్రం నిజమైనదిగా ఉండాలని భావించిన దర్శకనిర్మాతలు దాదాపు 30 లక్షలు విలువ చేసే ఒక నిజమైన కోహినూర్ లాంటి డైమండ్‌ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆ స్థాయిలో వజ్రం కొనుగోలు చేస్తే మాత్రం అమ్మేట‌ప్పుడు కూడా అదే రేట్‌కి అమ్మాలి అంటే కుదరదు. మరి ఏ ఎమ్ రత్నం ఇంతగా రిస్క్ చేస్తున్నాడు అంటే సినిమాలో ఏదో ఖచ్చితంగా జనాలను మైమరిపించి మురిపించే అంశమేదో గట్టిగానే ఉండి ఉంటుందని టాలీవుడ్ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

Updated On 13 Jan 2023 4:39 PM GMT
krs

krs

Next Story