విధాత: ఈ అమ్మాయి క్రికెట్ స్కిల్స్ సూప‌ర్బ్.. ప్ర‌తి బాల్‌ను కూడా ర‌ఫ్పాడించింది. ఏ ఒక్క బాల్‌ను కూడా మిస్ చేయ‌కుండా దంచికొట్టింది. ఆమె బ్యాటింగ్ ధాటికి బంతి స్కూల్ గ్రౌండ్ వెలుప‌ల‌కు దూసుకెళ్లింది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ల‌ఢ‌క్‌కు చెందిన డైరెక్ట‌రేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేష‌న్ ఈ వీడియోను విడుద‌ల చేసింది. ఇంటి ద‌గ్గ‌ర మా నాన్న‌, స్కూల్లో మా టీచ‌ర్.. న‌న్ను క్రికెట్ ఆడేందుకు ప్రోత్స‌హిస్తున్నారు. విరాట్ కోహ్లీలా ఆడేందుకు […]

విధాత: ఈ అమ్మాయి క్రికెట్ స్కిల్స్ సూప‌ర్బ్.. ప్ర‌తి బాల్‌ను కూడా ర‌ఫ్పాడించింది. ఏ ఒక్క బాల్‌ను కూడా మిస్ చేయ‌కుండా దంచికొట్టింది. ఆమె బ్యాటింగ్ ధాటికి బంతి స్కూల్ గ్రౌండ్ వెలుప‌ల‌కు దూసుకెళ్లింది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.


ల‌ఢ‌క్‌కు చెందిన డైరెక్ట‌రేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేష‌న్ ఈ వీడియోను విడుద‌ల చేసింది. ఇంటి ద‌గ్గ‌ర మా నాన్న‌, స్కూల్లో మా టీచ‌ర్.. న‌న్ను క్రికెట్ ఆడేందుకు ప్రోత్స‌హిస్తున్నారు. విరాట్ కోహ్లీలా ఆడేందుకు అన్ని ర‌కాలుగా ప్ర‌య‌త్నిస్తున్నాన‌ని ఆరో త‌ర‌గ‌తి చ‌దువుతున్న మ‌క్‌సుమా చెప్పింది.


విరాట్ కోహ్లీలా ఆడాల‌నేది త‌న ల‌క్ష్య‌మ‌ని ఆ విద్యార్థిని స్ప‌ష్టం చేసింది. ఎంఎస్ ధోనీలా హెలికాప్ట‌ర్ షాట్ కొట్టాల‌నేదే త‌న కోరిక అని, అందుకు సాధ‌న చేస్తున్నాన‌ని తెలిపింది. చిన్న‌ప్ప‌ట్నుంచి క్రికెట్ ఆడుతున్నాన‌ని పేర్కొంది. జీవితంలో ఏదో ఒక రోజు కోహ్లీ స్థాయికి త‌ప్ప‌కుండా ఎదుగుతాన‌న్న న‌మ్మ‌కం ఉంద‌ని ఆమె తెలిపింది. ఈ వీడియోను 25 వేల మంది వీక్షించ‌గా, 1200 మంది లైక్ చేశారు.

Updated On 17 Oct 2022 3:57 AM GMT
subbareddy

subbareddy

Next Story