Ravinder Chandrasekar | కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాత రవీంద్ర చంద్రశేఖరన్‌ అరెస్టయ్యారు. సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ (CCB)కి చెందిన ఎన్‌ట్రస్ట్‌మెంట్ డాక్యుమెంట్ ఫ్రాడ్ (EDF) వింగ్-1 రవీందర్ చంద్రశేఖరన్‌ను అరెస్టు చేసింది. ఓ వ్యాపారిని కోట్లాది రూపాయలను మోసం చేశారనే ఆరోపణలపై రూ.15.83కోట్ల మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉందని, రవీందర్‌ను జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించినట్లు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాధవ్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన బాలాజీ కాపా […]

Ravinder Chandrasekar |

కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాత రవీంద్ర చంద్రశేఖరన్‌ అరెస్టయ్యారు. సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ (CCB)కి చెందిన ఎన్‌ట్రస్ట్‌మెంట్ డాక్యుమెంట్ ఫ్రాడ్ (EDF) వింగ్-1 రవీందర్ చంద్రశేఖరన్‌ను అరెస్టు చేసింది. ఓ వ్యాపారిని కోట్లాది రూపాయలను మోసం చేశారనే ఆరోపణలపై రూ.15.83కోట్ల మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉందని, రవీందర్‌ను జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించినట్లు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాధవ్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన బాలాజీ కాపా గ్రేటర్‌ చెన్నై కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అక్టోబర్‌ 2020లో లిబ్రా ప్రొడక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన చంద్రశేఖరన్‌ మున్సిపల్‌ సాలిడ్‌ వేస్ట్‌ నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేసే ప్రాజెక్టులో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని నమ్మించినట్లు బాలాజీ ఫిర్యాదులో పేర్కొన్నారు.

పెట్టుబడికి సంబంధించి నకిలీ డాక్యుమెంట్లు సిద్ధం చేయించడంతో పాటు ఆయన నుంచి రూ.15.83 కోట్లు తీసుకున్నాడని, ప్రాజెక్టు విషయంలో ఇద్దరి మధ్య ఒప్పందం జరిగిందని, దీనికి ఆధారాలు సైతం ఉన్నట్లు తెలిపారు.

డబ్బులు తీసుకున్న తర్వాత రవీందర్‌ వ్యాపారాన్ని ప్రారంభిచలేదని, అదే సమయంలో డబ్బులు తిరిగి ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. చివరకు డబ్బు తిరిగి ఇవ్వాలని కోరగా.. రవీందర్‌ స్పందించకపోవడంతో చెన్నై సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా రవీందర్‌ను అరెస్టు చేసి విచారిస్తున్నారు.

Updated On 10 Sep 2023 1:43 PM GMT
cm

cm

Next Story