HomelatestKomatireddy | బి. వెల్లంల ప్రాజెక్టు చెంతనే.. ‘కోమటిరెడ్డి’ బర్త్ డే..! భారీగా కాంగ్రెస్ శ్రేణుల...

Komatireddy | బి. వెల్లంల ప్రాజెక్టు చెంతనే.. ‘కోమటిరెడ్డి’ బర్త్ డే..! భారీగా కాంగ్రెస్ శ్రేణుల సన్నాహాలు !!

Komatireddy |

విధాత: మాజీ మంత్రి, భువనగిరి ఎంపీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి 60వ జన్మదిన వేడుకలు మంగళవారం ఉదయ సముద్రం బ్రాహ్మణ వెల్లంల ఎత్తిపోతల ప్రాజెక్టు వద్దనే ఘనంగా నిర్వహించేందుకు ఆయన అనుచర వర్గం భారీ సన్నాహాలు చేపట్టింది.

శ్రీశైలం సొరంగం ప్రాజెక్టులో అంతర్భాగమైన ఉదయ సముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టు మంజూరుకు దివంగత సీఎం వైఎస్సార్ ప్రభుత్వ హయాంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక భూమిక పోషించి వైఎస్సార్ తోనే 2007లో శంకుస్థాపన చేయించారు.

699కోట్ల అంచనా వ్యయంతో 2009లో మొదలైన ఆ ప్రాజెక్టు పనులు చివరి దశకు చేరుకోగా 14 ఏళ్ల పిదప ఇటీవల రెండు మోటార్లతో ట్రయల్ రన్ నిర్వహించారు. నల్గొండ, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి నియోజకవర్గాలలో సాగునీరు, వాటి పరిధిలో గ్రామాలకు కృష్ణా జలాల తాగునీరు అందించేందుకు ఉదయం సముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పిదప కాంగ్రెస్ హయాంలో చేపట్టిన పలు ప్రాజెక్టుల తరహాలోనే ఉదయ సముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టు పనులలో కూడా తీవ్ర జాప్యం సాగుతూ వచ్చింది. 2018 ఎన్నికలకు ముందుగానే ప్రాజెక్టును పూర్తి చేస్తామని అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు మోటార్ల ట్రయల్ రన్ వరకు పనులు నత్తనడకగా సాగాయి. ప్రస్తుతం బ్రాహ్మణ వెల్లంల రిజర్వాయర్ కు నీటిని పంపింగ్ చేసే పనులు పూర్తయినప్పటికీ, రిజర్వాయర్ పరిధిలోని కుడి, ఎడమ కాలువలు, డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం పూర్తి కాలేదు.

 

అయితే రానున్న ఎన్నికలలో రాజకీయ ప్రయోజనాల నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీ నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఈ ప్రాజెక్టును ప్రారంభించేందుకు జూన్ నెల మొదటి వారంలో సీఎం కేసీఆర్ ను ఆహ్వానించారు. ప్రాజెక్టు పనుల పూర్తికి తాను సీఎం కేసీఆర్ పై తెచ్చిన ఒత్తిడితోనే మోటార్ల ట్రయల్ రన్ ప్రక్రియ పూర్తి చేసి రిజర్వాయర్ కు నీటిని అందించగలుగుతున్నామంటూ ఎమ్మెల్యే లింగయ్య తన నియోజకవర్గంలో ప్రచారం సాగిస్తున్నారు.

అటు నకిరేకల్ కాంగ్రెస్ నేతల దైద రవీందర్ కూడా మాజీ మంత్రి వెంకటరెడ్డి కృషి తోనే ప్రాజెక్టు నిర్మాణం జరిగిందంటూ ప్రచారం సాగిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో ప్రాజెక్టు పరిధిలోని నియోజకవర్గాల గ్రామాల్లో ఉదయ సముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం రాజకీయ ప్రాధాన్యత అంశంగా, ఎన్నికల ప్రచారాస్త్రంగా మారుతుంది.

ఈ నేపథ్యంలో ఉదయ సముద్రం ప్రాజెక్టు నిర్మాణ ఘనత కోసం అధికార బీఆర్ఎస్, ఇటు ప్రతిపక్ష కాంగ్రెస్ లు రెండు కూడా పోటీపడుతూ ప్రాజెక్టు వద్ద తరచూ రకరకాల రకరకాల కార్యక్రమాలతో సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రాజెక్టు మంజూరుకు కృషి చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ దఫా తన జన్మదిన వేడుకలను ఏకంగా ప్రాజెక్టు పరిధిలోని బ్రాహ్మణ వెల్లంల రిజర్వాయర్ వద్దనే జరుపుకోవాలని నిర్ణయించడం రాజకీయంగా ఆసక్తి రేపింది. వెంకటరెడ్డి బర్త్ డే వేడుకల కోసం ఇప్పటికే రిజర్వాయర్ పరిసరాల్లో ఆయన అనుచరులు భారీ ఏర్పాట్లు చేపట్టారు. కనీసంగా 20,000 మందికి భోజన వసతి ఏర్పాటు చేస్తున్నారు.

మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు హైదరాబాద్ నుంచి నార్కట్పల్లికి చేరుకొని 500 కార్ల భారీ కాన్వాయ్ తో బ్రాహ్మణ వెల్లంల రిజర్వాయర్ వద్దకు చేరుకుంటారు అక్కడ కృష్ణా జలాలకు పూజలు చేస్తారు అనంతరం సభా వేదిక పై కేక్ కట్ చేసి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతారు. ప్రాజెక్టు పరిధిలోని గ్రామాల ప్రజలను ఈ వేడుకలకు ఆహ్వానించడం ద్వారా రాజకీయంగా వెంకటరెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ వచ్చేలా ప్రయత్నిస్తుండటం విశేషం.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular