విధాత: బీజేపీ నేత కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డిని మునుగోడు మండ‌లం కేంద్రంలో పోలీసులు అరెస్టు చేశారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఫ్రీజ్ చేసిన‌ గొల్ల‌కుమరుమ సోద‌రుల అకౌంట్ల‌ను రిలీజ్ చేయాల‌ని సోమ‌వారం ఆయ‌న మండ‌ల కేంద్రంలో అనుచ‌రుల‌తో చేప‌ట్టిన ధ‌ర్నా ఉద్రిక్త‌లకు దారితీసింది. బీజేపీ ధర్నా కొనసాగుతుండగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయోత్సవ ర్యాలీ అదే చౌరస్తా నుంచి వెళ్లడంతో రెండు వర్గాల మధ్య స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ, టీఆర్ఎస్ శ్రేణులు పరస్పరం పోటాపోటీగా నినాదాలు […]

విధాత: బీజేపీ నేత కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డిని మునుగోడు మండ‌లం కేంద్రంలో పోలీసులు అరెస్టు చేశారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఫ్రీజ్ చేసిన‌ గొల్ల‌కుమరుమ సోద‌రుల అకౌంట్ల‌ను రిలీజ్ చేయాల‌ని సోమ‌వారం ఆయ‌న మండ‌ల కేంద్రంలో అనుచ‌రుల‌తో చేప‌ట్టిన ధ‌ర్నా ఉద్రిక్త‌లకు దారితీసింది.


బీజేపీ ధర్నా కొనసాగుతుండగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయోత్సవ ర్యాలీ అదే చౌరస్తా నుంచి వెళ్లడంతో రెండు వర్గాల మధ్య స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ, టీఆర్ఎస్ శ్రేణులు పరస్పరం పోటాపోటీగా నినాదాలు చేశారు.

దీంతో పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు ఇరువ‌ర్గాలను చెదరగొట్టారు. ఈ క్రమంలో మండ‌ల కేంద్రంలో శాంతిభ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగే ప‌రిస్థితి ఏర్ప‌డ‌డంతో పోలీసులు రాజ‌గోపాల్‌రెడ్డిని అరెస్ట్‌ చేశారు.

ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ను ముట్ట‌డిస్తా: రాజ‌గోపాల్‌రెడ్డి

గొల్ల కురుమ‌ల నిధులు విడుద‌ల చేయ‌క‌పోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాలుగు లక్షల మందితో ప్రగతి భవన్ ని ముట్టడిస్తామ‌ని కోమటిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి హెచ్చ‌రించారు. మునుగోడులో గొల్ల‌కురుమ‌ల అకౌంట్ల‌లో డ‌బ్బ‌లు వేసి, వాటిని వాడు కోకుండా అకౌంట్లు ఫ్రీజ్ చేశార‌ని ఆరోపించారు.

గొల్ల కురుమ సోదరుల అనుమతి లేకుండా ఎకౌంటు ఎలా ఫ్రీజ్ చేస్తార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఫ్రీజ్ చేసిన అకౌంట్ల‌న్నింటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గొల్ల కురుమ సోదరులకు డబ్బులు వచ్చేంత వరకు ఈ పోరాటం ఆగదన్నారు.

రాజ‌గోపాల్‌రెడ్డి 'సుశీ ఇన్‌ఫ్రా'పై జీఎస్టీ అధికారుల దాడులు

Updated On 14 Nov 2022 12:18 PM GMT
krs

krs

Next Story