Wednesday, March 29, 2023
More
    HomelatestKomatireddy Venkatareddy | చెరుకు సుధాకర్ నన్ను తిడుతున్నందుకే రియాక్ట్ అయ్యా.. ఇంతటితో వదిలేద్దాం

    Komatireddy Venkatareddy | చెరుకు సుధాకర్ నన్ను తిడుతున్నందుకే రియాక్ట్ అయ్యా.. ఇంతటితో వదిలేద్దాం

    విధాత: చెరుకు సుధాకర్ కాంగ్రెస్(Congress) పార్టీలో చేరినప్పటి నుండి తనను పదేపదే తిడుతుండటంతోనే తాను భావోద్వేగంతో సీరియస్‌గా రియాక్ట్ అయ్యానని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkatareddy) స్పష్టం చేశారు. చెరుకు సుధాకర్‌ను, ఆయన కొడుకు డాక్టర్ సుహాస్ (Dr. Suhas)ను ఫోన్లో బెదిరిస్తూ కోమటిరెడ్డి చేసిన హెచ్చరికల ఆడియో రేపిన వివాదంపై సోమవారం వెంకటరెడ్డి స్వయంగా స్పందిస్తూ వీడియోలు పోస్ట్ చేశారు.

    చెరుకు సుధాకర్(Cheruku Sudhkar) కొడుకు డాక్టర్ సుహాస్‌కు తాను ఫోన్ చేసి మాట్లాడిన మాటల్లో కొన్ని మాత్రమే లీక్ చేశారని, వాయిస్ రికార్డు పెట్టారని తనకు తెలుసని, మీ నాన్న నన్ను ఎందుకు తిడుతున్నారంటూ అడిగి తిట్టవద్దని చెప్పమని సుహాస్‌కు గట్టిగా చెప్పానన్నారు. తరుచు సుహాస్‌కు ఫోన్ చేస్తుంటానని, తనని తిడితే తన అభిమానులు కోపంతో సుధాకర్‌ను చంపుతారన్న ఆందోళనతో హెచ్చరించడం జరిగిందన్నారు.

    సుధాకర్ పైన, ఆయన కొడుకుపైన తాను చేసిన వాఖ్యలను ఆసరాగా చేసుకొని నన్ను రాజకీయంగా దెబ్బతీసే ప్రయత్నం సొంత పార్టీ వారు, ప్రత్యర్థి పార్టీల వారు చేస్తున్నారన్నారు. తాను 33 ఏళ్లుగా రాజకీయంలో ఏనాడు ఎవరిని పరుష పదజాలంతో దూషించలేదని, తన ప్రత్యర్థులను కూడా తాను చేరదీశానన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాజకీయ ఆర్థికంగా ఎన్నో సేవలు చేశానన్నారు. సుధాకర్‌తో వివాదంలో వారు తమను తప్పుగా అర్థం చేసుకోవద్దన్నారు.

    చెరుకు సుధాకర్ వ్యాక్యాల‌పై కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పంద‌న‌

    జనరల్ స్థానం నల్గొండ మున్సిపాలిటీలో మూడు సార్లు బీసీలకు చైర్మన్ పదవికి కేటాయించానన్నారు. వేలాది మందికి మంచి చెడుల్లో అండగా ఉండి, తన కొడుకు ప్రతిక్ ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులకు సహాయం చేస్తున్నానన్నారు. తన రాజకీయ జీవితమంతా నిస్వార్ధంగా ప్రజలకు సేవ చేస్తున్నానని, అలాంటి నన్ను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని, పార్టీకి పట్టిన దరిద్రులని, వాడు వీడు అని చెరుకు సుధాకర్ పదే పదే విమర్శలు చేయడం నన్ను బాధించిందన్నారు.

    ఇటీవల తనకు వ్యతిరేకంగా కోవర్ట్ రెడ్డి అంటూ వేసిన పోస్టర్ల వెనుక కూడా సుధాకర్ హస్తం ఉందన్న అనుమానాలు ఉన్నాయని, దానిపై విచారణ సాగుతుందన్నారు. పార్టీలో చేరినప్పటి మొదలు, మునుగోడు(Munugodu) ఉప ఎన్నికల నుండి మూడు నెలలుగా చేరుకు సుధాకర్ తనను తిట్టడం జరుగుతున్నా, తాను ఇంతకాలం సహనంతోనే ఉన్నానన్నారు.

    నకిరేకల్(Nakrekal ) టికెట్ కోసం తనకు నచ్చిన నాయకులను మెప్పించేందుకు చెరుకు సుధాకర్ నన్ను విమర్శించడం పనిగా పెట్టుకున్నాడన్నారు. నన్ను కోరితే టికెట్ విషయంలో నేను కూడా సుధాకర్‌కు సహాయం చేస్తానన్నారు. గతంలో సుధాకర్ పీడియాక్టు కేసులో జైలుకెళ్తే తాను ఆయన కోసం కొట్లాడానన్నారు. వరుసగా తనను సుధాకర్ తిట్టినందునా తాను భావోద్వేగంతో అలా సీరియస్‌గా మాట్లాడాల్సి వచ్చిందని, తన వాఖ్యల వెనుక మరేలాంటి దురుద్దేశం లేదని, ఇంతటితో వివాదాన్ని ముగించాలన్నారు.

    వెంకటరెడ్డి ఎప్పుడు ఎవరికీ అన్యాయం చేయలేదని, మేధావులు, అన్ని వర్గాల ప్రజలు తన వ్యాఖ్యలు భావోద్వేగంతో కూడుకున్నవని అర్థం చేసుకోవాలని, ఇక మీదట తాను ఇలా ఆవేశపడుతు వాఖ్యలు చేయబోనన్నారు. తనపై చెరుకు సుధాకర్ చేసిన విమర్శలను తాను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge)కు , పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్ రావు ఠాక్రే (Manik Rao Thackeray )లకు ఫిర్యాదు చేస్తానన్నారు.

    Read More>>

    Amitabh Bachchan | ప్రభాస్ మూవీ షూటింగ్ లో అమితాబ్‌ బచ్చన్‌కు గాయాలు..! ఆందోళనలో అభిమానులు..!

    Nalgonda: వెంకట్‌రెడ్డి పై నల్గొండ వన్ టౌన్ పోలీస్టేషన్‌లో చెరుకు సుహాస్ ఫిర్యాదు

    spot_img
    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular