Wednesday, March 29, 2023
More
    HomelatestMP Komatireddy Venkat Reddy । కాంగ్రెస్‌లో పంటికింద రాయిలా వెంకట్‌రెడ్డి తీరు

    MP Komatireddy Venkat Reddy । కాంగ్రెస్‌లో పంటికింద రాయిలా వెంకట్‌రెడ్డి తీరు

    • రేవంత్‌, ఆయన అనుయాయులే టార్గెట్‌
    • రేవంత్‌ పీసీసీ అధ్యక్షుడైన నాటి నుంచి మారిన స్వరం
    • కాంగ్రెస్‌ పార్టీలో ఉంటూనే పార్టీకి నష్టం చేసే వ్యాఖ్యలు
    • ఇంకా ఉపేక్షిస్తే కాంగ్రెస్‌కు కష్టకాలమే అంటున్న కార్యకర్తలు

    MP Komatireddy Venkat Reddy । తరచూ ఇష్టానుసారంగా నోరుపారేసుకునే కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తాజాగా సొంత పార్టీ నేత చెరుకు సుధాకర్‌పై చేసిన వ్యాఖ్యలతో ఆయన మరోసారి వివాదంలో నిలిచారు. ఇదే సమయంలో ఇప్పటికే చాలాసార్లు పార్టీ ఆయనను ఉపేక్షించిందని, ఇకనైనా ఆయనపై చర్యలు తీసుకోకపోతే పార్టీకి నష్టం వాటిల్లడం ఖాయమని కాంగ్రెస్‌ శ్రేణులు అంటున్నాయి.

    విధాత: కోమటిరెడ్డి బ్రదర్స్‌లో ఒకరైన వెంకట్‌ రెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్‌ పార్టీ (Congress Party)వర్గాల్లో తీవ్ర అసహనం వ్యక్తం అవుతున్నది. కోమటిరెడ్డి బ్రదర్స్‌ మొదటి నుంచి ఆధిపత్య వైఖరిని ప్రదర్శిస్తున్నారనే వాదన ఉన్నది. దానికి బలం చేకూర్చే విధంగానే ఆ ఇద్దరి అన్నదమ్ముల వ్యవహారశైలి ఉంటున్నదని అంటున్నారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలం, పార్టీ విధేయులం అంటూనే పార్టీ తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటారనేది వారిపై ప్రధాన విమర్శ. అధిష్ఠానంపై, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌పై ఆరోపణలు చేస్తుంటారు.

    ముఖ్యంగా రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) పీసీసీ అధ్యక్షుడు అయ్యాక వీరిద్దరూ ఆయనే టార్గెట్‌గా విమర్శలు చేశారు. చివరికి ఆయనను పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించాలనే దాకా వెళ్లారు. వీరు ఎన్ని విమర్శలు చేసినా పార్టీ అధిష్ఠానం సర్దిచెప్పే ప్రయత్నం చేసింది. రేవంత్‌రెడ్డి కూడా కలిసి పనిచేద్దాం, పార్టీ గెలుపు కోసం కృషి చేద్దామని వెంకట్ రెడ్డి అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నం చేశారు.

    పార్టీలో ఇమడలేకపోతే, పార్టీ విధానాలు నచ్చకపోతే ఎవరి దారి వారు చూసుకోవచ్చు. అందుకే రాజగోపాల్‌రెడ్డి కేవలం రేవంత్‌రెడ్డిపై ఉన్న కోపంతోనే కాంగ్రెస్‌ పార్టీని వీడారు అన్నది బహిరంగ రహస్యమే. తమ్ముడు పార్టీని వీడినప్పుడే వెంకట్‌రెడ్డి కూడా వెళ్తారు అనే ప్రచారం జరిగింది. అయితే తన తమ్ముడి నిర్ణయాలకు తనకు సంబంధం లేదని, తాను పార్టీలోనే కొనసాగుతానని చెప్పిన వెంకట్‌రెడ్డి మునుగోడు ఉప ఎన్నిక (Munugode Bypoll)సందర్భంగా చేసిన రాజకీయ రచ్చ అందరికీ తెలిసిందే.

    ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) మొదలు జాతీయ వంటి నేతలు ఆయనతో చర్చించి పార్టీ కోసం పనిచేయాలని సూచించారు. అక్కడ పార్టీ గెలుపు కోసం కార్యకర్తలు, నేతలు గట్టిగా కృషి చేస్తే అంటీముట్టనట్టు ఉండి తన తమ్ముడి గెలుపుకోసం పనిచేసి అపప్రధ మూటగట్టుకున్నారన్న విమర్శలు వచ్చాయి.  అప్పుడే వెంకట్‌రెడ్డి వ్యవహారశైలిని తప్పుపట్టిన నేతలు.. ఆయనపై చర్యలకు డిమాండ్‌ చేశారు. పార్టీ ఇస్తున్న స్వేచ్ఛ వెంకట్‌రెడ్డి ప్రస్తుతం నోటికి వచ్చినట్టు మాట్లాడటానికి కారణమైందనే అభిప్రాయం ఉన్నది. అంతటితో ఆగకుండా వచ్చే ఎన్నికల తర్వాత కేసీఆర్‌ కాంగ్రెస్‌ పార్టీతో కలిసిపోవాల్సిందేనని మరోసారి నోరు జారారు. అప్పుడూ ఆయన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపినా ఏఐసీసీ నేతలు క్షమించారు.

    దీంతో ఇక తాను ఏం మాట్లాడినా.. ఎవరిని బెదిరించినా నన్నేమీ చేయలేరు అన్న ధోరణిలో కనిపిస్తున్నదని కార్యకర్తలు అంటున్నారు. తాజా సొంతపార్టీ నేత చెరుకు సుధాకర్‌ (Cheruku Sudhakar)ను, ఆయన కొడుకును బెదిరించిన ఆడియో కలకలం సృష్టిస్తున్నది. తాను లక్షలాది మందికి మేలు చేశానని, వాళ్లంతా చంపేస్తారని, బయలుదేరారని ఫోన్‌లో ఆయన కొడుకు వార్నింగ్‌ ఇచ్చారు అసలు కోమటిరెడ్డి కాంగ్రెస్‌ పార్టీలోనే ఉన్నా వచ్చే ఎన్నికల నాటికి ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు అన్నది ఆయనకే క్లారిటీ లేదనే అభిప్రాయం బలంగా ఉన్నది. అలాంటి వ్యక్తిని పార్టీ ఇంకా ఉపేక్షిస్తే మొదటికే మోసం వస్తుందని పార్టీలో అంతర్గత చర్చ నడుస్తున్నట్టు సమాచారం.

    ప్రజాఉద్యమాల నుంచి వచ్చిన నేతను నిర్మూలిస్తానని అనడటం కాంగ్రెస్‌పార్టీలోని బడుగు, బలహీనవర్గాల నేతలను ఆందోళనకు గురిచేస్తున్నది. కోమటిరెడ్డి బ్రదర్స్‌ ఇద్దరూ వేర్వేరు పార్టీల్లో కొనసాగుతున్నా.. వారిద్దరి టార్గెట్‌ రేవంత్‌రెడ్డినే. అందుకే ఆయన పార్టీలోకి తెచ్చిన నేతలందరినీ బెంబేలెత్తించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన వ్యతిరేకులు ఆరోపిస్తున్నారు. సీడబ్ల్యూసీ (CWC), ఇతర కీలక పదవుల్లో ఉన్న నేతలెవరూ పార్టీని వీడినా వీళ్లలా విమర్శలు చేయలేదని గుర్తు చేస్తున్నారు. ఇలాంటి వారిపై పార్టీ చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీకి కష్టకాలమే అని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.

    spot_img
    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular