Konark wheel విధాత, జీ-20దేశాల సదస్సు వేదిక ప్రగతి మైదాన్ భారత్ మండపంకు చేరుకున్న వివిధ దేశాల అధ్యక్షులకు ప్రధాని మోడీ స్వాగతం తెలిపిన వేదిక వద్ద ఏర్పాటు చేసిన కోణార్కు చక్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒడిస్సా కోణార్కు సూర్య దేవాలయంలో కనిపించే కోణార్కు చక్రం చిహ్నం ఏర్పాటు చేసిన వేదిక వద్దనే మోడీ అతిధ్య దేశాల అధ్యక్షులకు కరచాలనం, ఆలింగనంలతో స్వాగతం పలికారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దృష్టి ఈ చక్రంపై పడగగా, […]

Konark wheel
విధాత, జీ-20దేశాల సదస్సు వేదిక ప్రగతి మైదాన్ భారత్ మండపంకు చేరుకున్న వివిధ దేశాల అధ్యక్షులకు ప్రధాని మోడీ స్వాగతం తెలిపిన వేదిక వద్ద ఏర్పాటు చేసిన కోణార్కు చక్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒడిస్సా కోణార్కు సూర్య దేవాలయంలో కనిపించే కోణార్కు చక్రం చిహ్నం ఏర్పాటు చేసిన వేదిక వద్దనే మోడీ అతిధ్య దేశాల అధ్యక్షులకు కరచాలనం, ఆలింగనంలతో స్వాగతం పలికారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దృష్టి ఈ చక్రంపై పడగగా, ప్రధాని మోడీ ఆయనకు కోణార్కు చక్ర విశిష్టతను తెలియచేశారు. కాగా చరిత్ర మేరకు ఈ కోణార్కు సూర్య దేవాలయం 13వ శతాబ్ధంలో రాజు మొదటి నరసింహదేవ్ పాలన కాలంలో నిర్మించారు. ఈ సూర్యాదేవాలయంలో ఏర్పాటుచేసిన ఈ చక్రం కోణార్కు చక్రంగా ప్రసిద్ది చేందింది. ఇది పురాతన ఖగోళ, కాలగమన విజ్ఞానాన్ని చాటుతూ అద్భుత శిల్పాకళా చాతుర్యంతో నిర్మితమైంది. గతంలో 20రూపాయల నోటుపై కూడా కోణార్కు చక్రం ముద్రితమైంది.
