అవమానించారంటూ శ్రేణుల వద్ద ఆవేదన నెల్లూరు రాజకీయాల్లో మరో అసమ్మతి KOTAMREDDY YCP NELLORE విధాత: నెల్లూరు జిల్లా వైసీపీలో ఇంకో ముసలం పుట్టింది. నిన్నటివరకూ వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఒక్కరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారనుకుంటే ఇప్పుడు తాజాగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా గొంతు కలిపారు. తనను తరచూ అవమానిస్తున్నారని, తన మీద నిఘా పెట్టారని మండిపడుతున్న కోటంరెడ్డి.. మొదటి నుంచి వెంట నడిచినందుకు ఇదేనా ప్రతిఫలం? ఇదేనా […]

  • అవమానించారంటూ శ్రేణుల వద్ద ఆవేదన
  • నెల్లూరు రాజకీయాల్లో మరో అసమ్మతి

KOTAMREDDY YCP NELLORE

విధాత: నెల్లూరు జిల్లా వైసీపీలో ఇంకో ముసలం పుట్టింది. నిన్నటివరకూ వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఒక్కరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారనుకుంటే ఇప్పుడు తాజాగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా గొంతు కలిపారు. తనను తరచూ అవమానిస్తున్నారని, తన మీద నిఘా పెట్టారని మండిపడుతున్న కోటంరెడ్డి.. మొదటి నుంచి వెంట నడిచినందుకు ఇదేనా ప్రతిఫలం? ఇదేనా మర్యాద? అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో కోటంరెడ్డి వైసీపీలోనే కొనసాగుతారా? లేక మరో దారి చూసుకుంటారా? అన్న చర్చ జిల్లా రాజకీయాల్లో జోరుగా నడుస్తున్నది. వైసీపీ నుంచి తీవ్రంగా ఇబ్బంది ఎదుర్కొంటున్న కోటంరెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారన్న వాదన కూడా వినిపిస్తున్నది.

తన ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని ఆరోపించిన శ్రీధర్ రెడ్డి.. తన వద్ద పది పన్నెండు సిమ్ కార్డులు ఉన్నాయని, దమ్ముంటే వాటన్నింటినీ ట్రాక్ చేసుకోవచ్చని పోలీసులకు సవాల్ విసిరారు. ఈ తరుణంలో నిన్న వినుకొండలో జగనన్న చేదోడు కార్యక్రమానికి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి అక్కడ కోటం రెడ్డి విషయంలో సీరియస్ అయ్యారని అంటున్నారు. నెల్లూరు జిల్లా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పిలిచి మరీ శ్రీధర్ రెడ్డి విషయం ఏదోటి తేల్చాలని సమాచారం.

వాస్తవానికి శ్రీధర్ రెడ్డికి.. ఎమ్మెల్యే గోవర్ధన్ రెడ్డికి మధ్య తీవ్ర విభేదాలున్నాయని, ఈ ఇద్దరికీ అసలు పడదని రాజకీయవర్గాలు అంటున్నాయి. ఈ తరుణంలో గోవర్ధన్ రెడ్డి కచ్చితంగా శ్రీధర్ రెడ్డి కి వ్యతిరేకంగానే నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. ఈ పరిస్థితిలో ఇన్ని అవమానాలు పడుతూ ఇక్కడే ఉండాలా లేక పార్టీని వదిలిపెట్టాలా? అనే మీమాంసలో పడ్డారని సమాచారం.

కోటం రెడ్డి 2014, 2019లలో రెండు సార్లు వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా నెగ్గారు. మంత్రి పదవి వస్తుందని ఆశించినా.. అది దక్కకపోగా ఆయన రాజకీయ ప్రత్యర్థి గోవర్ధన్ రెడ్డికి దక్కడంతో కోటం రెడ్డి నైరాశ్యానికి గురయ్యారు. ఒక దశలో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇదిలా ఉండగా శ్రీధర్ రెడ్డి స్థానంలో ఆయన సోదరుడు గిరిధర్ రెడ్డి కి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలని పార్టీ అధిష్ఠానం ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.

Updated On 31 Jan 2023 10:54 AM GMT
Somu

Somu

Next Story