Friday, October 7, 2022
More
  Home ఆంధ్ర ప్రదేశ్ Breaking: రెబల్ స్టార్ కృష్ణంరాజు క‌న్నుమూత‌

  Breaking: రెబల్ స్టార్ కృష్ణంరాజు క‌న్నుమూత‌

  విధాత: రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆయన హైదరాబాద్‌గచ్చిబౌలి లోని AIG ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారుజామున 3.25 నిమిషాలకు కన్నుమూశారు. ఆయనకు భార్య శ్యామలా దేవి, ముగ్గురు కుమార్తెలు (ప్రసీది, ప్రకీర్తి, ప్రదీప్తి) ఉన్నారు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు.

  1992లో నర్సాపూర్‌ ఎంపీగా కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి ఓడి పోయారు. 1998లో బీజేపీలో చేరి కాకినాడ నుంచి ఎంపీగా పార్టమెంటుకు వెళ్లారు. 1999లో నర్సాపూర్‌ నుంచి ఎంపీగా గెలిచారు. వాజపేయీ కేబినెట్‌లో కేంద్ర మంత్రిగా పని చేసిన ఆయన 2009లో ప్రజారాజ్యంలో చేరి ఎంపీగా ఓడిపోయి తిరిగి బీజేపీ గూటికి చేరారు.

  కాగా రేపు ఉదయం హైదరాబాద్‌లో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి సినీ రంగానికి తీరని లోటని కృష్ణంరాజు ఫాన్స్ గౌరవ సలహాదారుడు జొన్నలగడ్డ శ్రీరామచంద్ర శాస్త్రి అన్నారు.

  1940 జనవరి 20న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో విజజయనగర సామ్రాజ్య క్షతియ రాజ వంశంలో ఉప్పలపాటి కృష్ణంరాజు జన్మించారు. దాదాపు 187కు పైగా సినిమాల్లో రెబల్ స్టార్ నటించారు. 1966లో చిలకా గోరింక చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

  కృష్ణంరాజుకు బాగా పేరు తెచ్చిన చిత్రాలు భక్త కన్నప్ప, బొబ్బిలి బ్రహ్మన్న. వాజ్​పేయి హయాంలో కేంద్రమంత్రిగా పని చేశారు కృష్ణంరాజు. ఐదు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో ప్రయాణించిన ఆయన మరణంతో చిత్రసీమ విషాదంలో మునిగిపోయింది.

  హీరోగా సినీరంగ ప్రవేశం చేసిన ఆయన విలన్‌గానూ అలరించారు. అయితే చదువు పూర్తి కాగానే కొన్నాళ్లు జర్నలిస్టుగా కూడా ఆయన పనిచేశారు. ఫోటోగ్రఫీపై ఉన్న మక్కువతో హైదరాబాదులో రాయల్‌ స్టూడియో మొదలుపెట్టారు. ఆ తర్వాత మిత్రుల ప్రోత్సాహంతో సినీరంగంలో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మద్రాసు చేరుకున్నారు.

  ఎన్టీఆర్​, అక్కినేని తర్వాత.. తెలుగు సినీరంగంలో ఎన్టీఆర్​, అక్కినేని తర్వాత రెండో తరం వచ్చిన హీరోల్లో కృష్ణంరాజు ఒకరు. శోభన్‌బాబు, కృష్ణ వెండితెరకు పరిచయం అయినా కొన్నాళ్లకే 1966లో వచ్చిన ‘చిలకా గోరింక’ చిత్రంతో కృష్ణంరాజు.. వెండితెరకు హీరోగా పరిచయం అయ్యారు. అయితే తొలి చిత్రం ఫ్లాప్‌ కావడంతో చాలా నిరాశ పడ్డారు.

  https://vidhaatha.com/featured/birth-with-twins-fathers-two

  ఫ్లాప్‌తో ఆయనకు ఏమీ సంబంధం లేదని మిత్రులు, దర్శక నిర్మాతలు సర్దిచెప్పినా ఆయన సమాధాన పడలేదు. నటనను మెరుగుపరచుకునేందుకు అనేక పుస్తకాలు చదివారు. పాతకాలం నటుడు సీహెచ్​ నారాయణరావు వద్ద శిక్షణ తీసుకున్నారు.

  నటనలో పూర్తిస్థాయిలో సంతృప్తి చెందే వరకు ఎన్ని అవకాశాలు వచ్చినా వదులుకున్నారు. ఇది ఆయనలోని నిబద్ధతను పరిశ్రమకు చాటింది. తర్వాత డొండీ నిర్మాణ సారథ్యంలో.. అవేకళ్లు చిత్రంలో విలన్‌గా అలరించారు. ఆ చిత్రంలో ఆయన నటనకు విమర్శకుల నుంచీ కూడా ప్రశంసలు అందుకున్నారు.

  ‘అవే కళ్లు’ చిత్రంలో విలన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కృష్ణంరాజు.. తర్వాత వరుసగా 30 సినిమాల్లో విలన్‌ వేషాలే వేశారు. అయితే విలనిజంలో కూడా ప్రత్యేకత ఉంటేనే చేస్తానని కరాఖండిగా చేప్పేవారు. ఎన్టీఆర్​, ఏఎన్నార్​, శోభన్‌బాబు, కృష్ణ చిత్రాల్లో విలక్షణమైన ప్రతినాయకుడి పాత్రలు పోషించి యంగ్‌ విలన్‌గా పేరు తెచ్చుకున్నారు.

  విలన్‌ వేషాల తర్వాత పలు చిత్రాల్లో హీరో సపోర్టింగ్‌ క్యారెక్టర్స్‌ కూడా లభించాయి ఆయనకు ఎన్టీఆర్​తో ‘భలే మాస్టార్‌’, ‘బడి పంతులు’, ‘వాడే వీడు’, ‘పల్లెటూరి చిన్నోడు’, ‘మనుషుల్లో దేవుడు’, ‘మంచికి మరో పేరు’, ‘సతీ సావిత్రి’ చిత్రాల్లో నటించారు.

  అప్పటికే ప్రఖ్యాత విలన్‌ ఆర్‌ నాగేశ్వరరావు చనిపోవడంతో అంతా ఆయన్ను మరో ఆర్‌ నాగేశ్వరరావు తెలుగు తెరకు వచ్చారన్నారు. ఎన్నో అవార్డులు కృష్ణంరాజు విలక్షణమైన నటనా శైలి కారణంగా ఆయన్ను ఎన్నో అవార్డులు వరించాయి.

  ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 1977లో అమరదీపం చిత్రానికి, 1984లో బొబ్బిలి బ్రహ్మన్న చిత్రంలో ఆయన ప్రదర్శించిన నట విశ్వరూపానికి నంది అవార్డులతో సత్కరించింది. 1986లో తాండ్రపాపారాయుడు చిత్రానికి ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకున్న కృష్ణంరాజు 2006లో ఫిల్మ్‌ఫేర్‌ దక్షిణాది జీవితసాఫల్య పురస్కారాన్ని తీసుకున్నారు. ప్రభాస్‌తో కలిసి నటించిన రాధేశ్యాం ఆయన చివరి చిత్రం. కృష్ణంరాజు తమ్ముడు సూర్యనారాయణ కుమారుడు ప్రభాస్ రాజు.

  అక్కినేని కాంబినేషన్‌లో బుద్ధిమంతుడు, జైజవాన్‌, పవిత్రబంధం, మంచిరోజులు వచ్చాయి, మాతృమూర్తి చిత్రాల్లో విలన్‌గా నటించి మెప్పించారు. ఏఎన్నార్​ హీరోగా తెరకెక్కిన ‘ఎస్పీ భయంకర్‌’ చిత్రంలో సపోర్టింగ్‌ హీరోగా నటించారు. హీరో కృష్ణ కాంబినేషన్‌లో 17 చిత్రాల్లో హీరోగా నటించారు కృష్ణంరాజు.

  శోభన్‌బాబుతో బంగారు తల్లి, మానవుడు దానవుడు, జీవనతరంగాలు చిత్రాల్లో విలన్‌గా నటించారు. ఇద్దరు ఇద్దరే, కురుక్షేత్రం, రామబాణం, జీవితం చిత్రాల్లో సపోర్టింగ్‌గా నటించారు. ప్రత్యగాత్మ దర్శకత్వంలో వచ్చిన ఇంటిదొంగలు చిత్రంతో కృష్ణంరాజు..మళ్లీ హీరోగా మారారు. అయితే ఆ చిత్రం లేడీ ఓరియంటెడ్‌ అయినప్పటికీ ప్రత్యగాత్మతో ఉన్న అనుబంధం కారణంగా ఒప్పుకున్నారు.

  విలన్‌గా వెలుగొందుతున్న రోజుల్లోనే గోపికృష్ణా మూవీస్‌ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించి వరుసగా చిత్రాలు నిర్మించారు. స్వంత బ్యానర్‌లో వచ్చిన తొలి చిత్రం కృష్ణవేణి.. పన్నెండు కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. ఆ చిత్రంతో ఆయన హీరోగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. వరుసగా బయటి నిర్మాణ సంస్థల నుంచి హీరోగా అవకాశాలు రావడంతో బిజీగా మారిపోయారు.

  RELATED ARTICLES

  అయ్యబాబోయ్.. థమన్‌ని పట్టుకోలేకపోతున్నారుగా!

  విధాత: థమన్.. టాలీవుడ్‌లో మిస్సైల్‌లా దూసుకుపోతున్న పేరు. ఆయన సంగీతానికి ఇప్పుడు ప్రత్యేక ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సంగీతం అందించిన సినిమా అంటే.. థియేటర్లలో సౌండ్ బాక్స్‌లు మార్పించుకుంటున్న థియేటర్స్...

  మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా..? అయితే, మీకు గుడ్ న్యూస్‌!

  విధాత: రెగ్యుల‌ర్‌గా క్రెడిట్ కార్డు వినియోగించే క‌స్ట‌మ‌ర్ల‌కు నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా శుభ‌వార్త వినిపించింది. రూపే క్రెడిట్ కార్డుతో రూ.2000 వ‌ర‌కు జ‌రిపే యూపీఐ ట్రాన్సాక్ష‌న్స్ మీద...

  గరికపాటినీ వదలని మెగా బ్రదర్.. సోషల్ మీడియాలో సెటైర్!

  విధాత: ‘‘ఏపాటి వాడికైనా చిరంజీవిగారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే’’.. ఇది నాగబాబు చేసిన ట్వీట్. ఇది గరికపాటి వారినే అని ఎలా, ఎందుకు అనుకోవాలి...

  Most Popular

  అయ్యబాబోయ్.. థమన్‌ని పట్టుకోలేకపోతున్నారుగా!

  విధాత: థమన్.. టాలీవుడ్‌లో మిస్సైల్‌లా దూసుకుపోతున్న పేరు. ఆయన సంగీతానికి ఇప్పుడు ప్రత్యేక ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సంగీతం అందించిన సినిమా అంటే.. థియేటర్లలో సౌండ్ బాక్స్‌లు మార్పించుకుంటున్న థియేటర్స్...

  మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా..? అయితే, మీకు గుడ్ న్యూస్‌!

  విధాత: రెగ్యుల‌ర్‌గా క్రెడిట్ కార్డు వినియోగించే క‌స్ట‌మ‌ర్ల‌కు నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా శుభ‌వార్త వినిపించింది. రూపే క్రెడిట్ కార్డుతో రూ.2000 వ‌ర‌కు జ‌రిపే యూపీఐ ట్రాన్సాక్ష‌న్స్ మీద...

  గరికపాటినీ వదలని మెగా బ్రదర్.. సోషల్ మీడియాలో సెటైర్!

  విధాత: ‘‘ఏపాటి వాడికైనా చిరంజీవిగారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే’’.. ఇది నాగబాబు చేసిన ట్వీట్. ఇది గరికపాటి వారినే అని ఎలా, ఎందుకు అనుకోవాలి...

  ఆస్కార్‌కు RRR.. ఇప్పుడైనా కల నెరవేరుతుందా?

  విధాత: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘RRR’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెను ప్రభంజనాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. ఇద్దరు స్టార్ హీరోలతో రాజమౌళి...

  You cannot copy content of this page