Krithi Shetty | ఒకప్పుడు హీరోయిన్స్ చీరకట్టులో చాలా పద్దతిగా కనిపించే వారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కొందరు హీరోయిన్స్ కాస్త పద్దతిగా ఉంటున్నారు అని అనుకునే లోపే వారు గ్లామర్‌కి తెర లేపుతున్నారు. ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మారిన కృతి శెట్టి వరుస ఆఫర్స్ దక్కించుకుంటూ మంచి హిట్సే అందుకుంది. శ్యామ్ సింగరాయ్ మూవీతో సెకండ్ హిట్ తన ఖాతాలో వేసుకున్న ఈ అమ్మడు ఆ చిత్రంలో ఒకింత […]

Krithi Shetty |
ఒకప్పుడు హీరోయిన్స్ చీరకట్టులో చాలా పద్దతిగా కనిపించే వారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కొందరు హీరోయిన్స్ కాస్త పద్దతిగా ఉంటున్నారు అని అనుకునే లోపే వారు గ్లామర్‌కి తెర లేపుతున్నారు. ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మారిన కృతి శెట్టి వరుస ఆఫర్స్ దక్కించుకుంటూ మంచి హిట్సే అందుకుంది.
శ్యామ్ సింగరాయ్ మూవీతో సెకండ్ హిట్ తన ఖాతాలో వేసుకున్న ఈ అమ్మడు ఆ చిత్రంలో ఒకింత హద్దులు దాటి బోల్డ్ సన్నివేశాల్లో ఇరగదీసింది కూడా. నానికి లిప్ లాక్స్ ఇవ్వడంతో పాటు బెడ్ సీన్స్ లో నటించి అందరిని ఆశ్చర్య పరచింది. ఆ తర్వాత నాగార్జున, నాగ చైతన్య నటించిన బంగార్రాజుతో కృతికి హ్యాట్రిక్ హిట్ దక్కింది.
వరుసగా మూడు బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ దక్కడంతో కృతి శెట్టికి తిరుగు ఉండదని అందరు భావించారు. టాలీవుడ్ టాప్ హీరోయిన్ అయిపోవడం ఖాయం అనుకున్నారు. కాని గత ఏడాది ఆమెని వరుసగా ఫ్లాప్స్ పలకరించాయి.
ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రాలు మూడు డిజాస్టర్ కావడంతో ఆమె కెరీర్‌పై కాస్త ప్రతికూల ప్రభావం పడింది. ప్రస్తుతం ఇతర భాషలలో సినిమాలు చేస్తున్న కృతి శెట్టి తెలుగు సినిమా అవకాశాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది.
ఇదే సమయంలో తన గ్లామర్‌కి తెరలేపుతూ రచ్చ చేస్తుంది. సోషల్ మీడియాలో పొట్టి దుస్తులలో దిగిన పిక్స్ షేర్ చేస్తూ కాక రేపుతుంది. రీసెంట్‌గా కృతి శెట్టి లండన్ వెళ్ళింది. అక్కడి అందమైన వీధుల్లో చక్కర్లు కొడుతూ ఫొటోలకి పోజులిచ్చింది. ఒక్కరోజులో పూవు పూయదు. ఎదుగుదల స్లో అండ్ స్టడీగా ఉండాలి. విజయం దక్కడానికి కొంత సమయం పట్టొచ్చు అంటూ కృతి శెట్టి తన ఫొటోలకి క్యాప్షన్‌గా పెట్టింది.
ఏది ఏమైన ఇంత కురచ దుస్తులలో కృతి థైస్ షో చేస్తూ కుర్రాళ్లని కుదురుగా ఉండనివ్వకపోవడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. కృతి ఇటీవల తమిళంలో ఓ చిత్రం ప్రకటించింది. జయం రవి హీరోగా నటిస్తున్న ఈ చిత్రం టైటిల్ జీనీ కాగా, ఇందులో కళ్యాణి ప్రియదర్శి మరొక హీరోయిన్. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. మరోవైపు ఓ మలయాళ చిత్రంలో కూడా కృతి నటిస్తుంది
